
📌 Key Points
- జగపతిబాబు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
- సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.
- ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా డబ్బింగ్ లో రక్తం వచ్చిందని జగపతిబాబు తెలిపారు.
- త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది.
జగపతిబాబు ఒకప్పటి ఫ్యామిలీ హీరో. ఆయన ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన ‘అరవింద సమేత’ సినిమా డబ్బింగ్ సమయంలో తన నోటి నుండి రక్తం వచ్చిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సినిమా అనుభవాలను ఆయన పంచుకున్నారు.
జగపతిబాబు సినీ కెరీర్
Jagapathi Babu: విలక్షణ నటుడిగా ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు జగపతిబాబు (Jagapathi Babu) . తన అద్భుతమైన నటనతో, కామెడీతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా సంపాదించుకున్నారు. అలా అప్పట్లో పదుల సంఖ్యలో హీరోగా సినిమాలు చేసిన జగపతిబాబు.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.. ఒకవైపు కొన్ని చిత్రాలలో విలన్ గా నటిస్తూనే.. మరికొన్ని చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి ఈయన తాజాగా రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు ..ఎన్టీఆర్ తో సినిమా చేసేటప్పుడు.. ఆ సినిమా డబ్బింగ్ సమయంలో తన నోటి నుంచి రక్తం కూడా వచ్చింది అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఎన్టీఆర్ తో సినిమా అనుభవాలు
జగపతిబాబు ఎన్టీఆర్(NTR )తో చేసిన చిత్రం ‘అరవింద సమేత’. ఈ సినిమా జ్ఞాపకాలను ఆయన తాజాగా పంచుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా అరవింద సమేత సినిమా సమయంలో మీ గొంతు విషయంలో స్వర పేటిక కాస్త దెబ్బతిందని విన్నాము.. నిజమేనా? అని ప్రశ్నించగా.. జగపతిబాబు మాట్లాడుతూ..”కాస్త మొరటుగా అనిపించేలా గంటల తరబడి డబ్బింగ్ చెప్పడంతో నా గొంతు కూడా మొరటుగా మారిపోయింది. ఒకానొక సందర్భంలో నోటి నుంచి రక్తం కూడా వచ్చింది. షాకింగ్ వాయిస్ కావాలని ఇలా నేనే చేశాను. ఆ ప్రయత్నంలో అలా జరిగిపోయింది. అయితే మూవీ చేస్తున్నంతసేపు నేను చాలా ఎంజాయ్ చేశాను.. ఎందుకంటే ఆ సమయంలో పిచ్చి పీక్స్ లో ఉన్నాను. అందుకు తగ్గట్లుగా త్రివిక్రమ్ కూడా అదరగొట్టేశాడు” అంటూ చెప్పుకొచ్చారు.
ఇకపోతే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో 2018 లో వచ్చిన ఈ చిత్రం పేరుకే మాస్ యాక్షన్ మూవీ అయినప్పటికీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. ముఖ్యంగా “మచ్చల పులి గాండ్రిస్తే ఎట్టా ఉంటదో తెలుసా?” అంటూ వైవిధ్యమైన వాయిస్ తో జగపతి బాబు చెప్పిన డైలాగుకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందని చెప్పాలి. అయితే ఆ డబ్బింగ్ వెనుక రక్తం వచ్చే అంత కష్టం ఉంది అని తెలిసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఒక పాత్రను పండించడంలోనే కాదు ఆ పాత్రకు సరైన స్వరాన్ని అందించడంలో కూడా నటీనటులు ఈ రేంజ్ లో కష్టపడుతున్నారని తెలిసి వారి కష్టానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.
డబ్బింగ్ కష్టాలు
జగపతిబాబు నటిస్తున్న మరిన్ని చిత్రాల విషయానికొస్తే.. పెద్ది సినిమాతో పాటు పౌరాణిక థ్రిల్లర్ నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ లో నటిస్తున్నారు. అలాగే సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం సినిమాలో కూడా ఈయన నటిస్తున్నారు. ఇకపోతే పెద్ది సినిమాలో అప్పలసూరి పాత్రను రివీల్ చేస్తూ తాజాగా ఈయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో గుర్తుపట్టలేని లుక్కులో కనిపించారు. ఇక ఈ సినిమాలతో పాటు సీతా పయనం, సంబరాల ఏటిగట్టు తో పాటు దుల్కర్ సల్మాన్ 41వ సినిమాలో కూడా జగపతిబాబు నటిస్తున్నారు.
ఏది ఏమైనా నటీనటులు ఒక పాత్ర కోసం ఎంత కష్టపడతారో ఈ సంఘటన తెలియజేస్తుంది. జగపతిబాబు డబ్బింగ్ వెనుక ఉన్న కష్టం విని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.


