|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జైలర్ నటుడు వినాయకన్ కు షాక్: షూటింగ్ లో ప్రమాదం.. ఆరు వారాల విశ్రాంతి!

Published: 25-12-2025, 8:39 AM
జైలర్ నటుడు వినాయకన్ కు షాక్: షూటింగ్ లో ప్రమాదం.. ఆరు వారాల విశ్రాంతి!
  • జైలర్ నటుడు వినాయకన్ ‘ఆడు 3’ సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు.
  • యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా స్టంట్స్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
  • కొచ్చిలోని ఆస్పత్రిలో పరీక్షల అనంతరం మెడ, భుజం భాగాలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.
  • వైద్యుల సలహా మేరకు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని, ప్రస్తుతం ఆయన డిశ్చార్జ్ అయ్యారని సమాచారం.

జైలర్ సినిమాలో విలన్ పాత్రతో పేరు తెచ్చుకున్న నటుడు వినాయకన్ ‘ఆడు 3’ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో గాయపడిన ఆయన మెడ, భుజానికి దెబ్బలు తగలడంతో ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

వినాయకన్ కు ప్రమాదం ఎలా జరిగింది?

Actor Injured: సినిమా షూటింగ్ అంటే ఎంతో కష్టతరమైన పనని చెప్పాలి మూడు గంటల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసం సంవత్సరాలు తరబడి వేలమంది కష్టపడుతూ ఉంటారు. ఇలా సినిమా షూటింగ్ సమయంలో జరిగే ప్రమాదాలు కారణంగా కొంతమంది మరణిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇలా ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్లు షూటింగ్లో జరిగిన ప్రమాదం కారణంగా మరణించారు. అయితే తాజాగా జైలర్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన నటుడు వినాయకన్ సైతం సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన ఆడు 3 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా షూటింగ్లో భాగంగా కొన్ని యాక్షన్ సన్నివేషాలకు సంబంధించిన స్టంట్ లు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇలా నటుడు వినాయకన్ ప్రమాదానికి గురి అయిన నేపథ్యంలో వెంటనే తనని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొచ్చిలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఎమ్మారై స్కానింగ్ చేసిన అనంతరం ఆయన మెడ, భుజం భాగాలకు తీవ్ర గాయాలు అయినట్లు వైద్యులు తెలియజేశారు. ఇలా ప్రమాదం కారణంగా తీవ్ర గాయాలు అయిన నేపథ్యంలో ఆరువారాలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యలు వెల్లడించారు. అనంతరం ఈయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయాలని తెలుస్తుంది.

గాయాలు, ఆరు వారాల విశ్రాంతి అవసరం

ఇలా నటుడు వినాయకన్ ప్రమాదానికి గురయ్యారని విషయం తెలిసిన అభిమానులు కాస్త కంగారు వ్యక్తం చేసిన ఆయనకు పెద్దగా ప్రమాదం ఏమీ లేదని ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు వెల్లడించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. జైలర్ సినిమాలో వర్మన్ పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వినాయకన్ ఈ సినిమా తర్వాత పలు వివాదాలలో నిలిచారు. హీరోయిన్ల గురించి ఈయన మాట్లాడిన మాటలు అప్పట్లో పలు వివాదాలకు కారణం అయ్యాయి. ఇలా ఈ సినిమా అనంతరం వినాయకన్ ఆడు 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఉగాది సందర్భంగా ఆడు3 విడుదల..

‘ఆడు 3’ షూటింగ్, అభిమానుల ఆందోళన

మిధున్ మాన్యుయెల్ థామస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని విజయ్ బాబు,వేణు కున్నప్పిల్లి ఫ్రైడే ఫిల్మ్ హౌస్,కావ్య ఫిల్మ్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జయసూర్య, వినాయకన్, విజయ్ బాబు, సన్నీ వేన్ వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలాంటి తరుణంలోనే నటుడు వినాయకన్ ప్రమాదానికి గురి కావడంతో ఆయనకు సంబంధించిన షూటింగ్ మరికాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని 2026 మార్చి 19వ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు. మరి ఈ ప్రమాదం కారణంగా అనుకున్న సమయానికే సినిమా విడుదలవుతుందా లేదా వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.

వినాయకన్ ప్రమాద వార్తతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఆయనకు పెద్ద ప్రమాదం లేదని, త్వరగా కోలుకుంటారని వైద్యులు హామీ ఇవ్వడంతో ఊరట చెందారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.