
📌 Key Points
- 2026 ఆగస్టు నాటికి సినిమా విడుదల చేయాలనే తొందరలో హను రాఘవపూడి.
- సినిమా కోసం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి: ఎమోషనల్ మరియు యాక్షన్ సీన్స్.
- ప్రభాస్ సరసన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా ఎంపిక.
- 1940ల కాలం నాటి కథలు ప్రభాస్‌కు కలిసి రాలేదనే సెంటిమెంట్.
ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. సినిమాను త్వరగా పూర్తి చేయాలనే హడావిడిలో హను రాఘవపూడి రెండు యూనిట్లతో షూటింగ్ చేస్తున్నారు. హీరోయిన్ ఎంపికపై వస్తున్న విమర్శలు సినిమాపై ప్రభావం చూపుతాయా అనేది చూడాలి.
ఫౌజీ మూవీ షూటింగ్‌లో హడావిడి
Fauji Movie: ఏడాదికి ఒక సినిమా వదలడమే కష్టమైన ఈరోజుల్లో డార్లింగ్ ఫ్యాన్స్ కి మాత్రం వరుసగా బ్యాక్ టు బ్యాక్ ట్రీట్ ఇస్తామంటూ ఊరిస్తున్నారు ఫౌజీ మేకర్స్, అయితే సినిమాని త్వరగా కంప్లీట్ చేయాలన్న హడావిడి చూస్తుంటే అసలు హను రాఘవ పూడి ఏం ప్లాన్ చేస్తున్నాడా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.సినిమాని ఎట్టి పరిస్థితుల్లో 2026 ఆగస్టు నాటికి ఎలాగైనా రిలీజ్ చేయాలనే పట్టుదల వల్ల సినిమా క్వాలిటీ పై ఎఫెక్ట్ పడుతుందన్న టాక్ వినిపిస్తుంది.
హను రాఘవపూడి అంటేనే పర్ఫెక్షన్ కి కేరాఫ్
రిలీజ్ డేట్ ముంచుకోస్తుండటంతో సినిమాని త్వరగా కంప్లీట్ చేయాలన్న హడావిడిలో ఏకంగా రెండు యూనిట్లను పెట్టి హను రాఘవపూడి షూట్ ని లాగించేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. ఒక యూనిట్‌లో హను ఎమోషనల్ సీన్లు తీస్తుంటే, మరో యూనిట్ యాక్షన్ ఎపిసోడ్స్ ని చుట్టేస్తున్నారట. హను రాఘవపూడి అంటేనే పర్ఫెక్షన్ కి కేరాఫ్. అలాంటి డైరెక్టర్ కాకుండా మరొకరు సీన్స్ తీస్తుంటే రేపు స్క్రీన్‌పై ఆ అవుట్‌పుట్ మ్యాచ్ అవుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్న.
సినిమా బడ్జెట్ కట్ చేయడానికే కొత్తమ్మాయి?
హీరోయిన్ ఎంపికపై ట్రోల్స్
ఇక ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ సరసన ఇమాన్వీ ఇస్మాయిల్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ని హీరోయిన్ గా తీసుకోవడంతో నెట్టింట్లో ట్రోలింగ్ బాగానే జరిగింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ లాంటి లెజెండ్స్ నటిస్తున్న ఈ సినిమాలో అసలు నటనలో ఓనమాలు తెలియని ఒక అమ్మాయి ప్రభాస్ పక్కన అసలు ఎలా సూటవుతుందన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అయితే కొంతమంది అడుగు ముందుకు వేసి తను ప్రభాస్ ఇమేజ్‌కు సరిపోయే జోడీయేనా లేక సినిమా బడ్జెట్ ని కట్ చేయడానికి ఇలా కొత్తమ్మాయిని పట్టుకొచ్చారా అంటూ సెటైర్లు వేస్తున్నారు కూడా.
‘రాధే శ్యామ్’ విషయంలో ఏం జరిగిందో చూశాం కూడా
ఇక మరోవైపు 1940ల కాలం నాటి పీరియాడిక్ కథలు ప్రభాస్‌కు కలిసి రాలేదనే సెంటిమెంట్ ఫ్యాన్స్‌ను తెగ బయపెట్టేస్తుంది. గతంలో ‘రాధే శ్యామ్’ విషయంలో ఏం జరిగిందో మనం చూశాం కూడా. ఊరించి ఊరించి థియేటర్ల వద్దకు రాగానే బోల్తా కొట్టించాడు రాధాక్రిష్ణ.మళ్ళీ సేమ్ అలాగే ఆకాలం నాటి సెట్లు,అదిరిపోయే విజువల్స్ అంటూ హైప్స్ ని ఆకాశంలో పెట్టేస్తున్నాడు హను.నిజానికి సీతారామం తీసింది ఇతనే అయినా ఆ మ్యాజిక్ అన్నిసార్లు జరుగుతుందని అనుకోలేం.ఇక ఆ సినిమా ఆ రేంజ్ హిట్టవడానికి దుల్కర్ కూడా ఓక కారణం. కానీ ప్రభాస్ అంటేనే మాస్. మరి క్లాస్ గా సినిమాలు తీసే హను ఫౌజీతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.ఇక ఇదే ప్రభాస్ క్లాస్ లుక్ లో కనబడి బోల్తా పడ్డ సినిమాలు మన కళ్ళముందే ఉన్నాయ్ కూడా.
రాధే శ్యామ్ సెంటిమెంట్ భయం
ఆదిపురుష్ గ్రాఫిక్స్ క్వాలిటీ లేక మీమర్స్ కి స్టఫ్
నిజానికి ‘ఫౌజీ’ అంటేనే భారీ బడ్జెట్ తో పాటు సాలిడ్ గా గ్రాఫిక్స్ ఉన్న సినిమా.అసలే పీరియాడికల్ సినిమాలకి గ్రాఫిక్స్ చాలా ఇంపార్టెంట్. ప్రభాసే చేసిన ఆదిపురుష్ గ్రాఫిక్స్ క్వాలిటీ లేక మీమర్స్ కి స్టఫ్ గా మారడం మనం మర్చిపోలేదింకా. అలాంటిది ఫౌజిని అనుకున్న 2026 ఆగస్టు తీసుకురావాలన్న తొందరలో హను రెండు యూనిట్లతో చుట్టేస్తూ గ్రాఫిక్స్ ని పట్టించుకోకుండా ఉంటె మాత్రం ఓం రౌత్ ని ఆడుకున్నట్టుగా హనుని రెబల్ ఫ్యాన్స్ చెడుగుడు ఆడటం ఖాయం.
మొత్తానికి ‘ఫౌజీ’ సినిమా విడుదల విషయంలో మేకర్స్ చాలా టెన్షన్‌తో ఉన్నారు. రాధే శ్యామ్ ఫలితం పునరావృతం కాకుండా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. హను రాఘవపూడి ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.

