|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జన నాయగన్‌కు బ్రేకులు వేసిన సెన్సార్ బోర్డు! హైకోర్టు తీర్పు ఉన్నా తప్పని చిక్కులు!!

Published: 09-01-2026, 2:30 AM
జన నాయగన్‌కు బ్రేకులు వేసిన సెన్సార్ బోర్డు! హైకోర్టు తీర్పు ఉన్నా తప్పని చిక్కులు!!
  • విజయ్ దళపతి చివరి సినిమా ‘జన నాయగన్’ విడుదల వాయిదా.
  • సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యంపై హైకోర్టును ఆశ్రయించిన నిర్మాతలు.
  • సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన సెన్సార్ బోర్డు, డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు.
  • ‘భగవంత్ కేసరి’ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా పడింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తీర్పును సెన్సార్ బోర్డు సవాల్ చేసింది. దీంతో సినిమా విడుదల మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంది.

జన నాయగన్ సినిమా విడుదల వాయిదా?

Jana Nayagan:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) ఆఖరి సినిమాగా రాబోతున్న చిత్రం జన నాయగన్ (Jana Nayagan). తెలుగులో జన నాయకుడు , హిందీలో జననేత అనే టైటిల్స్ తో డబ్బింగ్ వె ర్షన్లలో ఈ సినిమాను జనవరి 9న అంటే ఈరోజు విడుదల చేయాల్సి ఉంది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కారణంగానే విడుదలకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలోని జననాయగన్ సినిమా నిర్మాతలు సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యంపై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. అయితే విచారణ నిర్వహించిన మద్రాస్ హైకోర్టు జన నాయగన్ చిత్రానికి భారీ ఊరట కలిగించింది.

ముందుగా సర్టిఫికెట్ ఇచ్చి ఆ తర్వాత రివ్యూకు ఎందుకు పంపించారు అని సెన్సార్ ను ప్రశ్నించింది హైకోర్టు. ఇక ముందుగా ఇచ్చిన యూ/ఏ సర్టిఫికెట్ ని మళ్ళీ జన నాయగన్ మూవీకి ఇవ్వాలి అని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో ఈ సినిమాకు సెన్సార్ లభించిందని, విడుదలకు సిద్ధమవుతుందని అభిమానులే కాదు చిత్ర బృందం కూడా అనుకునేలోపే ఇప్పుడు మరోసారి జన నాయగన్ కు షాక్ ఇచ్చింది సెన్సార్ బోర్డు.

హైకోర్టు తీర్పును సవాల్ చేసిన సెన్సార్ బోర్డు

అయితే హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత సెన్సార్ బోర్డు నిర్వహకులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ షాక్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో.. ఆ తీర్పుని సెన్సార్ బోర్డు సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలంటూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేసింది. ఈరోజు మధ్యాహ్నం 2: 15 గంటలకు ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఏది ఏమైనా జన నాయగన్ సినిమాకి వరుస సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి.

అన్నీ సెట్ అయితే కొత్త రిలీజ్ డేట్ జనవరి 23 అని అనుకుంటున్నారు. మరి ఈ టైం లో మళ్ళీ అప్లికేషన్ కి వెళ్తే అక్కడ రిలీజ్ డేట్ కి కూడా బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి.జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ దళపతి ఆఖరి సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్లో నిర్మించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాబి డియోల్, మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్ , ప్రియమణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. 2023లో బాలకృష్ణ తెలుగులో నటించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం రాబోతోంది. వాస్తవానికి డైరెక్టర్ ఈ సినిమా రీమేక్ కాదని ఇటీవల మలేషియాలో జరిగిన ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లో స్పష్టం చేసినా.. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మాత్రం 90% భగవంత్ కేసరికి రీమేక్ అని స్పష్టం చేసింది.

విజయ్ ఆఖరి సినిమాకు కష్టాలు తప్పవా?

మొత్తానికి జన నాయగన్ సినిమా విడుదల విషయంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. సెన్సార్ బోర్డు మళ్ళీ అభ్యంతరం తెలపడంతో సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.