
📌 Key Points
- విజయ్ ‘జన నాయకన్’ సినిమా నిడివి 20 నిమిషాలు తగ్గిందన్న వార్తల్లో నిజం లేదని నిర్మాత ధనంజయన్ స్పష్టం చేశారు.
- సినిమా సెన్సార్ ఇంకా పూర్తి కాలేదని, కోర్టు కేసు కారణంగా ఆలస్యమవుతోందని ఆయన తెలిపారు.
- హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రజా సంక్షేమం, న్యాయం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది.
- విజయ్, పూజా హెగ్డే ఇందులో నటించారు. సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
విజయ్ నటిస్తున్న ‘జన నాయకన్’ సినిమా నిడివి తగ్గిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై చిత్ర బృందం స్పందిస్తూ అసలు నిజం వెల్లడించింది. సినిమా విడుదల ఎప్పుడు అనే దానిపై స్పష్టత ఇచ్చింది.
20 నిమిషాల కట్: నిజమెంత?
Jana Nayagan: దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయకన్’. ఇప్పటకే ఈ సినిమా విడుదలవ్వాల్సింది. అయినే సెన్సార్ కారణాల వల్ల సినిమా విడుదల లేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. థియేటర్లలో విడుదల కోసం ఈ సినిమా నిడివిని సుమారు 20 నిమిషాల మేర తగ్గించారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై చిత్ర బృందం స్పందిస్తూ అసలు నిజానిజాలను వెల్లడించింది.
Read also- Upcoming Web Series OTT : హారర్ నుంచి యాక్షన్ వరకు… ఓటీటీలోకి వచ్చేస్తున్న అదిరే బ్లాక్‌బస్టర్ సినిమాలు, సిరీస్‌లు
నిర్మాతల స్పందన
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెన్సార్ బోర్డు వద్ద కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందని, అందుకే విడుదల వాయిదా పడిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే, సెన్సార్ బోర్డు కొన్ని “వివాదాస్పద” దృశ్యాలను తొలగించాలని ఆదేశించిందని, అందుకే మేకర్స్ 20 నిమిషాల సినిమాను కట్ చేసి మళ్ళీ రీ-ఎడిట్ చేస్తున్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ పుకార్లపై ప్రముఖ తమిళ నిర్మాత జి. ధనంజయన్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. సినిమాను 20 నిమిషాల పాటు కట్ చేశారన్న వార్తల్లో అస్సలు నిజం లేదు. ఒక కోర్టు కేసు కారణంగా సినిమా సెన్సార్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మేకర్స్ ఇంకా సెన్సార్ కోసం తేదీని కూడా ఖరారు చేయలేదు. ఎటువంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన అభిమానులను కోరారు. నిర్మాతల నుండి వచ్చే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలని సూచించారు.
Read also- Romantic web Series OTT : ముసుగు సుందరిని ప్రేమించే కోటీశ్వరుడు… ఓటీటీలో ఆకట్టుకుంటున్న సరికొత్త ప్రేమ కథ
విడుదల ఎప్పుడు?
‘జన నాయకన్’ ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్. ప్రజా సంక్షేమం, న్యాయం అనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో విజయ్ పూజా హెగ్డే నటిస్తున్నారు. బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, మమితా బైజు వంటి వారు ముఖ్యా పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా విడుదల, సెన్సార్ క్లియరెన్స్ అనేది పూర్తిగా కోర్టు నిర్ణయం పైనే ఆధారపడి ఉంది. ఈ సినిమా విడుదల కోసం విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. రిలీజ్ చివరి నిమిషంలో ఈ సినిమా సెన్సార్ కారణంగా విడుదల వాయిదా పడింది.
విజయ్ ‘జన నాయకన్’ సినిమా సెన్సార్ ప్రక్రియ కోర్టు కేసు కారణంగా ఆలస్యమవుతోంది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమై సినిమా విడుదల అవుతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.


