
📌 Key Points
- పెళ్లయిన మొదటి రోజు నుంచే నరకం చూశానని జయం రవి ఆవేదన వ్యక్తం చేశారు.
- భార్య కుటుంబం తనపై బ్లాక్ మేజిక్ చేసిందని, రక్తం వాంతులు అవుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
- తన సంపాదనపై నియంత్రణ కోల్పోయానని, పిల్లలను కూడా తనను చూడనివ్వడం లేదని కన్నీరు పెట్టుకున్నారు.
- సైబర్ బుల్లింగ్, అన్యాయాలపై చట్టపరమైన పోరాటం చేస్తానని, అన్ని ఆధారాలు ఉన్నాయని హెచ్చరించారు.
తమిళ నటుడు జయం రవి తన వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే నరకం చూశానని, భార్య కుటుంబం తనపై బ్లాక్ మేజిక్ చేసిందని ఆరోపించారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆవేదన వ్యక్తం చేస్తూ, న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు.
వ్యక్తిగత జీవితంపై జయం రవి సంచలన వ్యాఖ్యలు
Jayam Ravi: తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న జయం రవి తాజాగా ఒక ప్రెస్ మీట్ లో తన వ్యక్తిగత జీవితం, విడాకుల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, భార్య కుటుంబం నుండి తాను ఎదుర్కొన్న చిత్రహింసలను బయటపెట్టారు. ఇప్పటికే తన ప్రేయసి కూడా తనను విడిచి పెట్టి వెళ్లి పోయిన సంగతి తెలిసిందే.
Read also- రామ్ చరణ్ చేతికి గాయం ఇప్పటిది కాదా?.. అయినా సరే ‘పెద్ది’ కోసం..
గత 23 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఎలాంటి మచ్చ లేకుండా బతికా నని, కానీ తన మాజీ భార్య ఇంట్లో తనకు కనీస గౌరవం, ప్రశాంతత లేకుండా పోయాయని జయం రవి కన్నీరు పెట్టుకున్నారు. పెళ్లయిన మొదటి రోజు నుండి బ్లాక్‌మెయిల్స్‌తోనే జీవితం సాగిందని, ఆఖరికి తాను సంపాదించిన డబ్బు దాచుకోవడానికి తన పేరిట ఒక్క సొంత బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా చేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు పెట్టి కట్టిన ఇంటిని వదిలేసి, ప్రస్తుతం తాను అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు తెలిపారు. అలాగే, తన పిల్లలను కూడా తనను చూడనివ్వకుండా దూరం చేస్తున్నారని వాపోయారు.
తమ ఇంట్లో ఉన్నప్పుడు తనను పూర్తిగా అణచి ఉంచడానికి, ఒక పొట్టిపాములా మార్చడానికి బ్లాక్ మేజిక్ చేశారని జయం రవి సంచలన ఆరోపణలు చేశారు. ఆ చేతబడి ప్రభావం వల్లే ఇప్పుడు తనకు రక్తం వాంతులు అవుతున్నాయంటూ ఎమోషనల్ అయ్యారు. తనను మానసికంగా, శారీరకంగా చంపేయడానికి ఒక కూటమిలా ఏర్పడి ప్రయత్నిస్తున్నారని, అయితే అందరి సంగతి తేల్చాకే తాను విశ్రమిస్తానని స్పష్టం చేశారు,.
భార్య కుటుంబంపై తీవ్ర ఆరోపణలు
తన స్నేహితురాలు కెనిషాపై తనపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. కొందరు ఫాలోవర్స్ కోసం, వ్యూస్ కోసం ఒకరి జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సైబర్ బుల్లింగ్ కారణంగా ఎంతోమంది యువతీ యువకులు, సెలబ్రిటీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇలాంటి వారిని తాను చట్టపరంగా అస్సలు వదిలిపెట్టనని హెచ్చరించారు. తన వద్ద అన్ని అన్యాయాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే అన్నీ బయటకు వస్తాయన్నారు.
Read also- సామాన్యుడికి దూరమవుతున్న వెండితెర!.. ఐపీఎల్ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా..
ప్రస్తుత మానసిక పరిస్థితుల్లో తాను కెమెరా ముందుకు వచ్చి నటించలేనని జయం రవి ప్రకటించారు. “ప్రస్తుతానికి నేను నటించడం లేదు. నా పర్సనల్ లైఫ్‌ను క్లీన్ చేసుకుని, నా ఇమేజ్‌ను కాపాడుకున్న తర్వాతే మళ్లీ సినిమాల్లోకి వస్తాను. అంతవరకు అభిమానులు ఓపికగా ఉండాలి” అని కోరారు. ఈ కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన తోటి నటులు కార్తీ, ప్రభుదేవా వంటి వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
నా పిల్లల్ని నన్ను చూడనివ్వడం లేదు..భార్య ఆర్తి ఆరోపణలపై జయం రవి రియాక్షన్
బ్లాక్ మేజిక్, న్యాయ పోరాటం
ఫోన్లు లాక్కున్నారు…స్కూల్‌కి బాడీగార్డ్స్ తో పంపిస్తున్నారు. నా పిల్లలు ఈ వీడియో చూడాలి
ఒక గ్రూప్ క్రియేట్ చేసి, వాళ్లకు డబ్బులు ఇచ్చి నన్ను ఇలా చేయడం… ఇవన్నీ నాకు తెలియవా -తమిళ నటుడు జయం రవి pic.twitter.com/xdneyrNXKx
— ChotaNews App (@ChotaNewsApp) May 16, 2026
జయం రవి చేసిన ఈ ఆరోపణలు చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. తన పరువును కాపాడుకోవడానికి, న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.


