|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Jayashankar : ఈ ప్రయాణంలో వాళ్ళిద్దర్నీ కోల్పోయాను.. ఈ సినిమా వారికే అంకితం.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..

Published: 09-10-2025, 9:25 AM
Jayashankar : ఈ ప్రయాణంలో వాళ్ళిద్దర్నీ కోల్పోయాను.. ఈ సినిమా వారికే అంకితం.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..

‘పేపర్ బాయ్’ డైరెక్టర్ జయశంకర్ ఏడేళ్ల తర్వాత ‘అరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు డైరెక్టర్ ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తన తండ్రి, బావ మరణించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, వారికి ఈ సినిమాను అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.

Key Points

1

'పేపర్ బాయ్' ఫేమ్ డైరెక్టర్ జయశంకర్ ఏడేళ్ల తర్వాత 'అరి' సినిమాతో వస్తున్నారు.

2

'అరి' కథ అరిషడ్వార్గాలపై ఆధారపడి, అక్టోబర్ 10న విడుదల కానుంది.

4

'అరి' చిత్రాన్ని తన ప్రియమైన తండ్రి, బావలకు అంకితమిచ్చినట్లు డైరెక్టర్ భావోద్వేగ పోస్ట్.

5

డైరెక్టర్ జయశంకర్ 'అరి' సినిమాను తన తండ్రి, బావలకు అంకితమిచ్చారు.

అరి సినిమా కథా నేపథ్యం

Jayashankar : పేపర్ బాయ్ ఫేమ్ డైరెక్టర్ జయశంకర్ ఏడేళ్ల తర్వాత ఇప్పుడు అరి అనే సినిమాతో వస్తున్నాడు. ఏడేళ్ల పాటు ఈ సినిమా కోసం దేశంలోని ఆలయాలు, మఠాలు, ఆశ్రమాలు, హిమాలయాలు తిరిగి అరిషడ్వార్గాల మీద రాసుకున్నాడు. ఇప్పటివరకు సినీ పరిశ్రమలో రాని కాన్సెప్ట్‌ మీద కథగా రాసుకున్నాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది.

జయశంకర్ భావోద్వేగ పోస్ట్

వారికే అంకితం ‘అరి’ సినిమా

ఈ సినిమా రిలీజ్ కి ముందు డైరెక్టర్ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. జయశంకర్ తన పోస్ట్ లో.. రేపటి నుంచి అరి ఇక ఆడియెన్స్ సొంతం. నాకు ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది.. ఈ ప్రయాణంలో నా జీవితంలోని మూల స్తంభాలైన మా తండ్రి గారు(వంగ కనకయ్య), బావ గారు(కె.వి. రావు) మరణించారు. నేను వారిద్దరినీ కోల్పోయాను. అరి సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌పై వారి ఆశీస్సులు ఉంటాయి. ఈ మూవీని నేను ఆ ఇద్దరికీ అంకితం చేస్తున్నాను అని తెలిపారు.

మొత్తంగా, ‘అరి’ సినిమా జయశంకర్ జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందనుంది. తన ప్రియమైన వారి జ్ఞాపకాలతో ముడిపడిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక భావోద్వేగ ప్రయాణం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.