|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్: పవన్ కళ్యాణ్ విధ్వంసం.. గబ్బర్ సింగ్ వైబ్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!

Published: 07-03-2026, 11:05 AM
ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్: పవన్ కళ్యాణ్ విధ్వంసం.. గబ్బర్ సింగ్ వైబ్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!
  • పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టే ఎంట్రీ – గబ్బర్ సింగ్ రోజులు గుర్తుకు తెచ్చిన ఉస్తాద్!
  • శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 19న గ్రాండ్ రిలీజ్!
  • డీఎస్‌పీ సంగీతం, థమన్ బీజీఎంతో ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ అదిరింది
  • కౌబాయ్ గెటప్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ – ఫ్యాన్స్ ఫిదా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ గ్లింప్స్ విడుదలైంది. ఈ చిత్రం పవన్ అభిమానులకు ఒక పండగలాంటిది. గ్లింప్స్ చూస్తేనే పూనకాలు వచ్చేలా ఉంది!

పవన్ కళ్యాణ్ మాస్ అవతార్!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ రూపొందింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీ ఈ నెల 19న విడుదల కాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ ని షురూ చేసింది టీమ్‌. ఈ చిత్రానికి డీఎస్‌పీ సంగీతం అందిస్తుండగా, థమన్‌ బీజీఎం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మూవీ నుంచి గ్లింప్స్ వచ్చింది. `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`ట్రైలర్‌ టీజ్‌ పేరుతో దీన్ని విడుదల చేశారు.

గ్లింప్స్ చూస్తే, ఫారెస్ట్ లో పోలీస్‌ అధికారిగా తన జీప్‌పై ఎంట్రీ ఇచ్చాడు పవన్‌ కళ్యాణ్‌. ఈ క్రమంలో భగవద్గీతలోని శ్లోకం వినిపిస్తుంది. ఇంతలోనే ప్రత్యర్థులను ఆడుకుంటాడు పవన్‌. తనదైన యాక్షన్‌తో రెచ్చిపోయాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. ఈ సందర్భంగా ఆయన డైలాగ్‌ చెబుతూ, `ఇందాక మీరు విన్నది భగవద్గీత.. ఇది భగత్‌ గీత, దమ్మున్నోడు దాటొచ్చు` అని పవన్‌.. పోలీస్‌స్టేషన్‌లో గీత గీస్తాడు. అనంతరం విలన్లని చితక్కొడతాడు.

గ్లింప్స్‌లో అదిరిపోయే డైలాగులు!

ఇక ఇందులో పవన్‌ కళ్యాణ్‌ కౌబాయ్‌ గెటప్‌లో కనిపించారు. ఆయన హ్యాట్‌ పెట్టుకుని, కౌబాయ్‌ డ్రెస్‌లో అదిరిపోయేలా ఉన్నారు. స్టయిలీష్‌గా ఉన్నాడు. అభిమానులు కోరుకున్నట్టుగా పవన్‌ లుక్‌ పవర్‌ఫుల్‌గా ఉండటం విశేషం. అయితే పవన్‌ మ్యానరిజం, డైలాగ్‌ డెలివరీ, ఆయనలోని ఎనర్జీ చూస్తుంటే `గబ్బర్‌ సింగ్‌` రోజులను గుర్తు చేస్తుంది. అభిమానులను ఖుషీ చేస్తోంది. మరి మరోసారి `గబ్బర్‌ సింగ్‌` మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా? అనేది చూడాలి.

‘గబ్బర్ సింగ్’ తరువాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన లభించింది. పవర్‌ ఫుల్‌ డైలాగులు పూనకాలు తెప్పించాయి.

ఉగాదికి థియేటర్లలో రచ్చ షురూ!

తాజాగా విడుదలైన గ్లింప్స్ కూడా ఆకట్టుకోవడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి  నిర్మిస్తున్నారు. మార్చి 26న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వారం ముందుగానే `ఉగాది` పండగ సందర్భంగా మార్చి 19న విడుదల చేయబోతున్నారు. దీంతో అభిమానులు సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌తో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రోజులను గుర్తు చేశారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.