
📌 Key Points
- కమెడియన్ సత్య హీరోగా ‘జెట్లీ’ సినిమా రూపొందుతోంది.
- మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింగ్ హీరోయిన్‌గా ఎంపికైంది.
- రియా పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
- సినిమాలో సత్య, రియా మధ్య లవ్ ట్రాక్ ఉండదని దర్శకుడు స్పష్టం చేశారు.
కమెడియన్ సత్య హీరోగా తెరకెక్కుతున్న ‘జెట్లీ’ సినిమాలో మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింగ్ హీరోయిన్‌గా ఖరారైంది. ఆమె పుట్టినరోజున విడుదలైన ఫస్ట్ లుక్ ఆసక్తి రేపుతోంది. అయితే సినిమాలో సత్య-రియా మధ్య లవ్ ట్రాక్ ఉండదని దర్శకుడు రితీష్ రానా స్పష్టం చేశారు.
సినిమా నేపథ్యం, దర్శకుడు రితీష్ రానా
JETLEE : ఈ రోజుల్లో చాలా జోనర్స్ లో సినిమా రావడం అనేది కామన్ గా జరుగుతూ ఉంది. అయితే కొన్ని విషయాల్లో చాలా మార్పులు సంభవించినట్లు కామెడీ సినిమాల్లో కూడా కొన్ని మార్పులు వచ్చేసాయి. ముఖ్యంగా కామెడీ సాధారణంగా ఉంటే ఈ రోజుల్లో ఎవరు అంతగా ఇష్టపడటం లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెడీ రాయడంలో కూడా నేటి దర్శకులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెడీ రాసి సక్సెస్ అయిన దర్శకుడు రితీష్ రానా. మత్తు వదలరా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రితీష్. ఇటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ సినిమా ఆ స్థాయిలో ఆశ్చర్యపరిచింది కాబట్టి తన రెండవ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ లావణ్య త్రిపాఠి నటించిన ఆ హ్యాపీ బర్త్డే డిజాస్టర్.
కమెడియన్ సత్య ప్రస్తుతం రితీష్ రానా దర్శకత్వంలో జెట్లీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన పోస్టరే చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒక జెట్ విమానం పైన సత్య నిల్చున్న విధానం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
అయితే ఇప్పుడు ఈ సినిమాలో సత్య కి హీరోయిన్ గా రియా సింగ్ కన్ఫర్మ్ చేశారు. నేడు రియా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక రియా విషయానికి వస్తే 2024 సెప్టెంబర్ 22న జైపూర్ జరిగిన తొలిదశలో, 51 ఫైనలిస్ట్‌లను ఓడించి ఆమె మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకుంది.
రియా సింగ్ పరిచయం, ఫస్ట్ లుక్
ఇక రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే వారణాసి సినిమా నుంచి మందాకిని పోస్టర్ ఎలా అయితే ఉందో అదే స్థాయిలో ఒక చేత్తో గన్ పట్టుకొని రియా ఉంది. అయితే మందాకిని నీటుగా చీర కట్టుకున్న జేమ్స్ బాండ్ లా ఉంటుంది. కానీ ఈ సినిమా రియా పోస్టర్ మాత్రం జేమ్స్ బాండ్ టైపులో ఉంది.
Miss Universe India in a Universal Telugu cinema 👸❤️🔥
Introducing #RheaSingha , landing from the world of #JETLEE ✈️
Wishing the Amazing and Gorgeous Rhea a very Happy Birthday 🥳
సత్య-రియా మధ్య లవ్ ట్రాక్ లేకపోవడం
A @RiteshRana ‘s turbulence 🛫 Starring #Satya , #RheaSingha , @vennelakishore Produced by… pic.twitter.com/1h0pYj6I6T
— Mythri Movie Makers (@MythriOfficial) December 10, 2025
కమెడియన్ సత్యా పక్కన హీరోయిన్ గా రియాన్ పెట్టినా కూడా వాళ్ళిద్దరికీ మధ్య లవ్ ట్రాక్ ఉండదు అని డైరెక్టర్ ఈ పోస్టర్ అనౌన్స్మెంట్ వీడియోలోనే తేల్చి చెప్పేసాడు. వెంటనే దానికి కమెడియన్ సత్య రియాక్షన్ కూడా మంచి సెటైరికల్ గా ఉంది.
సాధారణంగా కామెడీ చిత్రాలకు భిన్నంగా జెట్లీ సినిమా రూపొందుతున్నట్లు పోస్టర్, హీరోయిన్ ఎంపిక ద్వారా తెలుస్తోంది. కమెడియన్ సత్య, మిస్ యూనివర్స్ ఇండియా రియాల కాంబినేషన్, లవ్ ట్రాక్ లేకపోవడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.


