|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ ‘డ్రాగన్’: ప్రశాంత్ నీల్ మాయాజాలం! విడుదల తేదీ ఖరారు! ఫ్యాన్స్ కి పండగే!

Published: 26-01-2026, 6:35 AM
ఎన్టీఆర్ 'డ్రాగన్': ప్రశాంత్ నీల్ మాయాజాలం! విడుదల తేదీ ఖరారు! ఫ్యాన్స్ కి పండగే!
  • ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
  • నైట్ షూట్ సన్నివేశాలతో కూడిన షెడ్యూల్ తాజాగా పూర్తయింది.
  • ఈ సినిమా జూన్ 25న విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
  • ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూద్దాం.

రామోజీ ఫిలిం సిటీలో డ్రాగన్ షూటింగ్

Jr.Ntr -Neel: టాలీవుడ్ స్టార్,  గాడ్ ఆఫ్ మాసేస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన దేవర సినిమా తర్వాత బాలీవుడ్ వార్ 2 సినిమాలో బిజీ అయ్యారు ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న  స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా విడుదల అయిన అనంతరం ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా షూటింగుకు సంబంధించి ఒక అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. గత కొద్ది రోజులుగా రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా నైట్ షూట్ చేసే సన్ని వేషాలు చిత్రీకరించారు. తాజాగా ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సినిమాటోగ్రాఫీ బృందం వెల్లడించారు.

జూన్ 25న విడుదల కానుందా?

ఇక ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి కూడా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ సినిమాని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు సగభాగం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25వ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా విడుదల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలబడబోతుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం డ్రాగన్ అనే పేరుతో షూటింగ్ పనులను జరుపుకుంటున్నప్పటికీ ఈ సినిమాకు వేరే టైటిల్ ఉందని త్వరలోనే టైటిల్ కూడా గ్రాండ్ ఈవెంట్ ద్వారా రివిల్ చేయబోతున్నట్టు తెలియజేశారు.

ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్

హీరోయిన్ గా రుక్మిణి వసంత్

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ ప్రశాంత్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సినిమా పట్ల కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ప్రశాంత్ ఎన్టీఆర్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ ప్రభాస్ తో సలార్ సీక్వెల్ పనులలో బిజీ కానున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 25న విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.