
జ్యేష్ఠమాసం, శుక్రవారం, జూన్ 13, 2025 నాటి ద్వాదశ రాశులకు ఈ రాశిఫలాలు. ప్రతి రాశి వారికి ఈ రోజు గ్రహాల ప్రభావం, సూచనలు, జాగ్రత్తలు ఇక్కడ వివరించబడ్డాయి.
Key Points
జూన్ 13, 2025 నాటి రాశిఫలాలను తెలుసుకోండి.
ప్రతి రాశికి ప్రత్యేక సూచనలు మరియు జాగ్రత్తలు.
వృత్తి, ఆరోగ్యం, కుటుంబంపై రాశి ప్రభావం.
సంతోషకరమైన రోజు కోసం చిన్నపాటి జాగ్రత్తలు.
మేషం నుండి కర్కాటకం వరకు రాశి ఫలాలు
రాశిఫలాలు (దిన ఫలాలు) : 13.06.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: జ్యేష్ట, వారం : శుక్రవారం, తిథి : కృ. విదియ, నక్షత్రం : పూ. ఆషాడ
మేష రాశి వారికి ఈ రోజు గ్రహ సంచారాలు ప్రతికూలంగా ఉన్న మిశ్రమ స్థితులను చూడగలరు. ముఖ్యమైన వ్యవహారాల్లో కదలికలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఆరోగ్య, ఆర్థికాలు సామాన్యంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగులకు పనిభారములు ఎక్కువ. విద్యార్థులు, నిరుద్యోగులు నిరుత్సాహం ఏర్పరచుకోకుండా వ్యవహరించుకోవాలి. భూక్రయ విక్రయాలు ముందుకు సాగుతాయి. తప్పనిసరి ఆధ్యాత్మికతలకు ప్రాధాన్యతను ఇచ్చుకోండి.
ఆలోచనలను కార్యరూపంలో పెట్టగలరు. అవకాశాలు కలసివస్తాయి. శ్రమకు తగిన గుర్తింపులు లేకపోయినా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. వివాహాది శుభాల స్థిరీకరణలు, కొందరికి నిశ్చితార్థములు పూర్తవుతాయి. అనారోగ్య భావనలు, అధికారులచే ఒత్తిడులు ఉంటాయి. వాహన, యంత్రాదులను అమర్చుకోవడం, నూతన అగ్రిమెంట్లు చేసుకోవడం జరుగుతుంది.
మిథున రాశి వారికి ఈ రోజు ఒత్తిడికి గురికావడం, అవసరాలను సమర్థించుకోలేకపోవడం జరుగుతుంది. యంత్ర, వాహనాల వంటి రిపేర్లను ఏర్పరచగలరు. వ్యాపారాలు నత్తనడకన సాగగలవు. ఆస్తి విభజనలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ వ్యక్తుల మధ్య ఏకీభావములు ఉంటాయి. కొన్ని అత్యవసరంగా అనుకున్న పనులు వాయిదా పడడం, చివరదాకా సాగి ఆగిపోవడం వంటివి జరుగుతాయి.
సింహం నుండి మీనం వరకు రాశి ఫలాలు
కర్కాటక రాశి వారు నూతన విషయాలను తెలుసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక గురు బోధలకు ప్రాధాన్యతనిచ్చుకోగలరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. వ్యాపారాలలో చెల్లింపులు పూర్తిచేసుకోగలరు. ప్రభుత్వతరహా పనులను చేపట్టి పూర్తిచేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. భూక్రయ విక్రయాలలో చలనములు ఉంటాయి. వివాహ, ఉద్యోగయత్నీకులు పట్టుదలతో సాగాల్సి వుంటుంది.
సింహ రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. కుటుంబ వ్యక్తుల తీరు మీకు పని ఒత్తిడిని ఏర్పరచడమే కాక, ఏకాగ్రతను లేకుండా చేయగలదు. ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుంటుంది. వివాహ నిశ్చయాలు, ఉద్యోగ సిద్ధి ఉంటాయి. బంధుమిత్రుల సహాయాలు కోరతారు, కానీ సహకరించడానికి దూరంగా ఉంటారు. కాల దుర్వినియోగాలు ఉండకుండా చూసుకోవాలి. ప్రయత్నించి ప్రయోజనాలు పొందగలుగుతారు.
గ్రహ సంచారాలు మిశ్రమ ప్రయోజనం ఇస్తాయి. ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. పనిచేసే చోట గుర్తింపులు ఏర్పరచుకుంటారు. గృహోపకరణాలు, స్థిరాస్తుల విషయాల్లో పెట్టుబడులు ఉంచగలరు. సంతానం, ఉద్యోగం, వివాహాది విషయాల్లో శుభాలు ఉంటాయి. కుటుంబంతో విందులకు హాజరవుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు చేయగలరు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి.
తుల రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలను చేపడతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల పట్ల అంకితభావాలు చూపగలరు. ఆర్థికంగా చిన్న మొత్తంలో ఋణ స్వీకారాలు ఉంటాయి. అగ్రిమెంట్లు, కాంట్రాక్టులు కుదుర్చుకుంటారు. దూర ప్రయాణాలను వాయిదా వేయవలసి వస్తుంది. బంధువులతో తగుమాత్రంగా వ్యవహరించండి. ఉద్యోగాల్లో గత తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారుల స్నేహహస్తములు ఉంటాయి.
వృశ్చిక రాశి వారు మంచి ప్రయోజనాలు ఏర్పరచుకుంటారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. కుటుంబ సభ్యులను కలుపుకొని యత్నించుకోవాలి. ఉద్యోగస్థులు కొంత సంయమనంతో సాగాలి. స్థిరాస్తుల క్రయవిక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. స్పెక్యులేషన్ రంగాల పట్ల ఆసక్తి ఏర్పడగలదు. చిన్నతరహా పెట్టుబడులు ఉంచవచ్చు. వివాహ, ఉద్యోగ యత్నాల్లో నిరాశలు ఏర్పరచుకోకుండా సాగండి.
ఈ రోజు జాగ్రత్తలు మరియు సూచనలు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ స్థితులుంటాయి. ఒక పనికి 4 లేక 5 సార్లు యత్నించవలసి రావచ్చు. ఆదాయాలు ఉన్నా సంతృప్తి, ఖర్చుల నియంత్రణ అవసరం అవుతుంది. ఉద్యోగులకు అధికారిక హోదాలు ఏర్పడతాయి. కోరుకున్న సమాచారాలను సేకరిస్తారు. ఆలోచనలను వెంటనే అమలు చేయక, పునరాలోచనలు తప్పనిసరి చేయండి. ఆధ్యాత్మికతలకు ప్రాధాన్యతనిచ్చి విరాళాలు ఇవ్వగలరు.
ప్రయాణాలను తప్పించుకోవడానికి ప్రయత్నించండి. వాహన, యంత్రాదులతో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణ స్థాయిలో సాగుతాయి. కుటుంబంలో ఏకవాక్యతలు ఉంటాయి. ఆధ్యాత్మికతలను మానసికంగా నిర్వహించుకోలేకపోతారు. అసహాయతను చూసి కొన్ని సమస్యలను జటిలం చేసుకోవచ్చునన్న సూచనలుంటాయి.
కుంభ రాశి వారికి ఈ రోజు ప్రయత్నాలను వేగవంతం చేసుకోండి. ఇతరుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనీయకుండా, వ్యక్తిగత ఆలోచనలు అమలు చేసుకోండి. స్థిరాస్తుల క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. వద్దనుకున్న కొన్ని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. వివాహ, ఉద్యోగ ప్రతిపాదనలు ముందుకు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నచిన్న మార్పులు చేసి ప్రయోజనాలు పొందుతారు.
మీన రాశి వారికి ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. శత్రు వర్గములో ఉన్న సోదరులు, తోటి ఉద్యోగులలో మంచి మార్పులు చూడగలరు. వ్యక్తిగతంగా ఉత్సాహం, సౌఖ్యం ఏర్పడతాయి. కుటుంబంలో ఏకవాక్యతలు ఉంటాయి. మాతాపితల ఆరోగ్యంకై జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. మీరు ప్రత్యేక గుర్తింపు, గౌరవం పొందగలరు. ఆర్థికంగా ప్రయోజనాలు ఏర్పరచుకోగలరు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – 9494981000
ఈ రాశిఫలాలను మార్గదర్శకంగా తీసుకొని, మీ రోజును సంతోషంగా మరియు సుఖంగా గడపండి. జాగ్రత్తలు పాటించి సమస్యలను నివారించుకోండి.


