|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? మోహన్ లాల్ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టనుందా?

Published: 18-04-2026, 6:35 AM
కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? మోహన్ లాల్ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టనుందా?
  • కళ్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ లాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు.
  • ఈ వార్తలను కళ్యాణి తల్లి లిస్సి ఖండించారు.
  • హృదయం సినిమాలో వీరిద్దరి జోడీకి మంచి గుర్తింపు వచ్చింది.
  • ప్రస్తుతం కళ్యాణి తన సినిమాలపైనే దృష్టి సారించారు.

కళ్యాణి ప్రియదర్శన్, మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ లాల్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై కళ్యాణి తల్లి లిస్సి స్పందిస్తూ వాటిని ఖండించారు.

కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి వార్తలు వైరల్

Kalyani Priyadarshan: సినిమా ఇండస్ట్రీలో సెలెబ్రెటీలకు సంబంధించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఒక హీరో హీరోయిన్ కాస్త చనువుగా కనిపించిన లేదా రెండు మూడు సినిమాలలో కలిసిన నటిస్తే చాలు వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరో నటి సైతం ఇలాంటి వార్తలలో నిలిచారు. ఇటీవల లోక అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ నటుడు మోహన్ లాల్(Mohan Lal) కుమారుడు ప్రణవ్ లాల్ (Pranav lal)రిలేషన్ లో ఉన్నారని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట సైలెంట్ గా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల పట్ల కళ్యాణి తల్లి నటి లిస్సి (Lissy)స్పందిస్తూ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా ఒక అభిమాని కళ్యాణి ప్రణవ్ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ప్రశ్నించడంతో వెంటనే ఈమె స్పందిస్తూ వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

వార్తలపై స్పందించిన కళ్యాణి తల్లి లిస్సి

ఇలాంటి వార్తలను అసలు నమ్మకండి అంటూ లిస్సి కళ్యాణి ప్రణవ్ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ బ్రేకులు వేశారు. ఈమె స్పందించడంతో వీరిద్దరి పెళ్లి గురించి వస్తున్న వార్తలకు పులి స్టాప్ పెట్టినట్టు అయింది. ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్ పూర్తిగా తన సినిమాలపైనే దృష్టి సారించారని చెప్పాలి. అయితే వీరిద్దరి గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. కళ్యాణి ప్రణవ్ జంటగా హృదయం అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతగానో ఆకట్టుకుంది.

ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచనలు లేవు..

ప్రణవ్, కళ్యాణిల మధ్య కెమిస్ట్రీ

ఈ నేపథ్యంలోనే కళ్యాణి ప్రణవ్ నిజ జీవితంలో కూడా ఒక్కటైతే బాగుంటుందని అభిమానులు భావించారు. ఈ సినిమా తరువాత నుంచి వీరిద్దరి లవ్ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ప్రణవ్ లాల్ తో కళ్యాణి ఏడడుగులు నడిచి స్టార్ హీరో ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్నట్టు వస్తున్న వార్తలకు ఆమె తల్లి చెక్ పెట్టారు. ప్రస్తుతం నటి కళ్యాణి పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించలేదని, తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంచారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె లోక సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.

కళ్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ లాల్‌ల పెళ్లి వార్తలకు లిస్సి పుల్‌స్టాప్ పెట్టారు. ప్రస్తుతం కళ్యాణి తన సినీ కెరీర్‌పై దృష్టి సారించారని ఆమె తెలిపారు. అభిమానులు ఈ జంట పెళ్లి గురించి ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.