|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kamal Haasan: కమల్ హాసన్‌ వివాదాస్పద కామెంట్స్.. హీరోకు మద్దతుగా లేఖ!

Published: 30-05-2025, 10:43 AM
Kamal Haasan: కమల్ హాసన్‌ వివాదాస్పద కామెంట్స్.. హీరోకు మద్దతుగా లేఖ!

కమల్ హాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కన్నడ చిత్ర పరిశ్రమ ఆయనకు వ్యతిరేకంగా నిలిచింది. అయితే, సౌత్ ఇండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆయనకు మద్దతుగా నిలిచింది.

Key Points

1

కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం

2

కన్నడ చిత్ర పరిశ్రమ ఆగ్రహం, థగ్ లైఫ్ నిషేధం

4

కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరణ

కమల్ హాసన్ వ్యాఖ్యలపై తీవ్ర వివాదం

కమల్‌ హాసన్‌ కామెంట్స్‌పై పెద్దఎత్తున వివాదం నడుస్తోంది. కన్నడ భాషను ఉ‍ద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నటించిన థగ్ లైఫ్‌ మూవీ అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోవైపు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం కమల్‌ హాసన్‌కు గట్టి షాకిచ్చింది. క్షమాపణలు చెప్పకపోతే థగ్‌ లైఫ్‌పై బ్యాన్ విధిస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో కమల్‌ హాసన్‌కు ఇచ్చిన డెడ్‌ లైన్‌ పూర్తి కాగానే థగ్‌ లైఫ్‌ను నిషేధించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

కన్నడ చిత్ర పరిశ్రమ ప్రతిస్పందన

అయితే ఈ వివాదం మరింత ముదురుతున్న వేళ.. కమల్‌ అండగా ఓ ప్రకటన విడుదలైంది. కమల్‌ హాసన్‌కు మద్దతుగా సౌతిండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ నిలిచింది. కమల్ హాసన్‌పై ప్రస్తుతం వస్తున్న వ్యతిరేకత సినీ ఇండస్ట్రీలో ఓ చీకటికోణంగా నిలుస్తుందని తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక ప్రజలు, కన్నడ చిత్ర పరిశ్రమ ఆయన  వ్యాఖ్యల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలని కోరింది. ప్రాంతీయ, భాషా రంగాలకు అతీతంగా ఐక్యతను ప్రోత్సహించిన కమల్ హాసన్ లాంటి వ్యక్తిని తప్పుగా చిత్రీకరించడం అన్యాయమని అసోసియేషన్ ప్రకటనలో వెల్లడించింది. కమల్ హాసన్‌ను కన్నడ భాష వ్యతిరేకిగా చిత్రీకరించడాన్ని అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.

సినీ ఇండస్ట్రీ మద్దతు

అయితే తాను చేసిన కామెంట్స్‌పై కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఇది ప్రజాస్వామ్యం, నాకు చట్టం, న్యాయంపై నమ్మకముంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కేరళ పట్ల నాకున్న ప్రేమ నిజమైందన్నారు. నన్ను ఇంతకు ముందు కూడా ఇలానే బెదిరించారు.. నేను తప్పు చేస్తే క్షమాపణలు చెబుతా.. తప్పు చేయకపోతే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. కాగా.. ఇప్పటికే కమల్ హాసన్ రాబోయే చిత్రం ‘థగ్ లైఫ్’ను కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ నిషేధించింది.

కమల్ హాసన్ వివాదం ఇంకా ముగియలేదు. ఆయన వ్యాఖ్యలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలను చూస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.