
హారర్ ఫ్రాంచైజీ ‘కాంచన’ నాలుగో భాగానికి సంబంధించి ఆసక్తికర వార్త వెలువడింది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న ‘కాంచన-4’లో పూజా హెగ్డే, నోరా ఫతేహి దెయ్యాలుగా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
Key Points
'కాంచన' ఫ్రాంచైజీ హర్రర్ సినిమాల్లో టాప్‌లో నిలిచింది.
రాఘవ లారెన్స్ 'కాంచన-4'కు దర్శకత్వం వహించి నిర్మిస్తున్నారు.
పూజా హెగ్డే, నోరా ఫతేహి దెయ్యాలుగా నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన.
మేకర్స్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్, అంచనాలు భారీగా పెరిగాయి.
కాంచన ఫ్రాంచైజీ విజయ ప్రస్థానం
హర్రర్ ఫ్యాంచైజీల్లో టాప్‌లో ఉంటుంది ‘కాంచన’ సినిమా. ఈ చిత్రం కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఓ వైపు వినోదం అందించడంతో పాటు మరోవైపు బాక్సాఫీసు వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దీంతో చిత్రబృందం ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించగా.. ‘కాంచన-2’ 2011లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఒక 2015లో ‘కాంచన-3’రాగా.. ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం రాఘవ లారెన్స్(Raghava Lawrence) ‘కాంచన-4’పనుల్లో ఫుల్ బిజీ అయిపోయారు.
దెయ్యాలుగా పూజా హెగ్డే, నోరా ఫతేహి
ఈ సినిమాకు రాఘవ దర్శకుడిగా, ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ‘కాంచన-4’ షూటింగ్ కూడా సగం పూర్తి అయినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో రాఘవా లారెన్స్‌తో పూజా హెగ్డే, నోరా ఫతేహి కనిపించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు దెయ్యాలుగా నటించబోతున్నట్లు గత కొద్ది కాలంగా ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ విషయాన్ని నిజం చేస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ‘‘మీ తీవ్ర భయంలో కూడా పూజా హెగ్డే తన అందంతో మిమ్మల్ని మూర్ఛపోయేలా చేస్తుంది.
అధికారిక ప్రకటన.. వైరల్ అవుతున్న పోస్టులు
స్వర్గం మీ కోసం వేచి చూస్తోంది. మా ప్రాజెక్ట్ లోకి పూజా హెగ్డేకు స్వాగతం చెప్తున్నాము’’ అని రాసుకొచ్చారు. అలాగే నోరా ఫతేహి ఫొటో షేర్ చేస్తూ.. ఆమె తన అందంతో మీ హృదయాలను దోచుకోవడానికి సిద్ధమవుతోంది. మీ భయానకతను మరచిపోయేలా చేయడానికి వస్తుంది. నోరా ఫతేహి ఆన్‌బోర్డ్. మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది’’ అని వెల్లడించారు. ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది.. చూసిన నెటిజన్లు మూడు పార్టులకంటే ‘కాంచన-4’ మరింత భయానకంగా ఉంటుందోమో అని భయపడిపోతున్నారు. లింకు
కాంచన-4లో హాట్ బ్యూటీస్ పూజా హెగ్డే, నోరా ఫతేహి దెయ్యాలుగా కనిపించనుండటంతో అభిమానుల ఆసక్తి పతాక స్థాయికి చేరింది. ఈ అధికారిక ప్రకటన సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. మరి నాలుగో భాగం ఎంతగా భయపెడుతుందో చూడాలి.


