
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల కానుంది. అయితే, గుజరాత్‌లోని విమాన ప్రమాదం కారణంగా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రద్దు చేయబడింది. ట్రైలర్ విడుదల కూడా వాయిదా పడింది.
Key Points
గుజరాత్‌లోని విమాన ప్రమాదం కారణంగా కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రద్దు.
ట్రైలర్ విడుదల తేదీ ఒక రోజు వాయిదా వేయబడింది.
మంచు విష్ణు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.
కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల కానుంది.
గుజరాత్ విమాన ప్రమాదం
Kannappa : మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27 న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో వరుసగా ప్రమోషన్స్ చేస్తూ భారీ ఈవెంట్స్ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నిర్వహిస్తున్నారు. రేపు జూన్ 13 కన్నప్ప సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ప్లాన్ చేసారు. అయితే ప్రస్తుతం కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నేడు ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు మరణించినట్లు తెలుస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కన్నప్ప ట్రైలర్ లాంచ్ రద్దు
ఈ ప్రమాదం కారణంగానే కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేస్తున్నామని, ట్రైలర్ రిలీజ్ ని ఒకరోజు వాయిదా వేస్తున్నామని, మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తూ మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
మంచు విష్ణు ప్రకటన
గుజరాత్ విమాన ప్రమాదం నేపథ్యంలో కన్నప్ప ట్రైలర్ లాంచ్ రద్దుతో పాటు, మంచు విష్ణు సంతాపం తెలిపారు. సినిమా విడుదల తేదీ మాత్రం మారలేదు.


