
రిషబ్ శెట్టి నటనలో తెరకెక్కిన కాంతార చిత్రం తరువాత, దాని ప్రీక్వెల్ ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే, కేరళలో ఈ చిత్రం విడుదలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.
Key Points
కాంతార చాప్టర్ 1 కేరళలో విడుదలకు అడ్డంకులు.
లాభాల వాటాపై ఎగ్జిబిటర్స్ యూనియన్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మధ్య విభేదం.
కేరళలో చిత్ర ప్రదర్శన నిలిపివేత.
కేరళలో విడుదలకు అడ్డంకులు
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి . ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది . ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . కాంతార చాప్టర్ -1 పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు . ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2 న థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది .
లాభాల వాటా వివాదం
అయితే రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ మూవీకి అడ్డంకులు ఎదురువుతున్నాయి . కేరళలో ఈ చిత్రాన్ని విడుదల చేయనివ్వమని ఎగ్జిబిటర్స్ యూనియన్ ప్రకటించింది . ఈ సినిమాను కేరళలో రిలీజ్ చేస్తున్న సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో లాభాల వాటాపై డీల కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు . ఈ సినిమా రిలీజైన మొదటి రెండు వారాలు లాభాల్లో 55 శాతం వాటా ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ యూనియన్ డిమాండ్ చేసింది . అయితే ఇందుకు పృథ్వీరాజ్ సుకుమారన్ కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ నిరాకరించింది . దీంతో కేరళలో సినిమా ప్రదర్శనను నిలిపిస్తున్నట్లు యూనియన్ నిర్ణయం తీసుకుంది . ఈ ప్రకటనతో కాంతార ప్రీక్వెల్ వీక్షించాలనుకున్న మలయాళీలకు నిరాశే తప్పేలా లేదు .
ఎగ్జిబిటర్స్ యూనియన్ నిర్ణయం
మలయాళ సినిమాలు ఇతర రాష్ట్రాల్లో రిలీజైనప్పుడు కేవలం 40 శాతం లాభాల వాటా మాత్రమే పొందుతున్నామని ఎగ్జిబిటర్ల యూనియన్ అధ్యక్షుడు విజయకుమార్ అన్నారు . మలయాళ చిత్ర నిర్మాతలకు అంత వాటా రానప్పుడు .. ఈ పంపిణీదారులు ఎందుకు అంత మొండిగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వారి నుంచి ఈ విషయంలో చొరవ తీసుకోకపోతే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోబోమని ఎగ్జిబిటర్ల యూనియన్ పేర్కొంది. కాగా .. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, రాకేష్ పూజారి , గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు.
కాంతార చాప్టర్ 1 కేరళ విడుదలకు ఎదురైన అడ్డంకులు మలయాళీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. లాభాల వాటాపై సర్దుబాటు చేసుకుంటే మాత్రమే విడుదల అవకాశం ఉంది.


