|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కరిష్మా కపూర్ కోపం వెనుక అసలు రహస్యం? పాపరాజీలతో గొడవ, నెటిజన్ల ట్రోల్స్!

Published: 30-04-2026, 8:48 PM
కరిష్మా కపూర్ కోపం వెనుక అసలు రహస్యం? పాపరాజీలతో గొడవ, నెటిజన్ల ట్రోల్స్!
  • కరిష్మా కపూర్ పాపరాజీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్.
  • ‘జూమ్ చేయొద్దు’ అంటూ కెమెరామెన్‌లపై ఫైర్ అయిన నటి.
  • వయస్సు, ముడతలు దాచడానికే ఆమె అలా ప్రవర్తించిందని నెటిజన్ల విమర్శ.
  • ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 5 షూటింగ్ సమయంలో ఘటన.

కరీనా కపూర్ అక్క కరిష్మా కపూర్ ఇటీవల పాపరాజీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ప్రవర్తన వెనుక అసలు కారణం వయస్సు దాచడమేనని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ వివాదం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పాపరాజీలపై కరిష్మా కపూర్ ఆగ్రహం

Karisma Controversy : కరిష్మా కపూర్ ..కరీనా కపూర్ అక్కగా ఎక్కువ మంది గుర్తు పట్టే ఈ వెటరన్ బ్యూటీ ప్రవర్తించిన తీరిప్పుడు మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కారణం ఏంటో తెలుసా.. ఫోటోలు తీసే పాపరాజీలపై ఒంటికాలుపై లేవడమే. విషయం లోకి వెళ్తే ప్రస్తుతం సోనీ టీవీలో మే 9, 2026 నుంచి టెలీకాస్ట్ కానున్న ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 5 షో షూటింగ్‌లో తెగ బిజీగా గడిపేస్తుంది.

అయితే తాజాగా షూటింగ్ ముగించుకొని వస్తున్న కరీనా కపూర్ ని పాపరాజీలు ఎప్పటిలాగే ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డారు. కానీ ఇక్కడే మొదలైంది అసలు డ్రామా.కొందరు ఫోటోగ్రాఫర్స్ కాస్త ముందుకు వెళ్లి కరీనాని ఫోటోలు తీయబోతుంటే “జూమ్ మత్ కర్నా” (జూమ్ చేయకండి) అంటూ వారిపై తెగ ఫైర్ అయిపొయింది.అయితే పైకి కాస్త సున్నితంగా అడిగినా , కళ్ళలో కోపం, గర్వం క్లియర్ కనిపిస్తుందని ,మీరు కావాల్సిందే పబ్లిసిటీ అని, మళ్ళీ ఫోటోలు తీస్తుంటే ఈ మండిపడటం ఎందుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.ఇక మరికొంత మంది ఒక అడుగు ముందుకేసి ఏజ్ బార్ అయినట్టు తెల్సిపోతుందనేమో అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు కూడా.

అసలు రూపం ఎక్కడ బయటపడుతుందో

వయస్సు దాచడానికేనా ఈ కోపం? నెటిజన్ల ప్రశ్నలు

ఇక ఈ సంఘటనలో కరిష్మా ఇలా రియాక్ట్ అవ్వడం వెనుక అసలు కారణం ఆమె వయస్సు దాచడమేనని ఇన్ స్టాగ్రామ్ లో ట్రోల్స్ మొదలయ్యాయి. 50 ఏళ్లు దాటిన ఈ నటి, జూమ్ చేస్తే తన ముఖంపై ఉన్న ముడతలు, మేకప్ వెనుక దాగున్న అసలు రూపం ఎక్కడ బయటపడుతుందో అని భయపడే ఇలా అరిచిందని నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు.

అప్పట్లో ‘రాజా హిందుస్తానీ’, ‘దిల్ తో పాగల్ హై’ వంటి సినిమాలతో స్టార్ స్టేటస్ కొట్టేసిన కరీనా వయసుతో వచ్చిన మార్పులని భరించలేకపోతుందని, ఏజ్ బార్ అయితే మొహంలో మునుపటి గ్లో తగ్గిపోవడం కామన్ అని, దానికి పాపరాజీలపై పడి ఏడవడం ఎందుకన్న కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయ్.ఇక ఇదే తరహాలో గతంలో ఆలియా భట్, రష్మిక, జయా బచ్చన్, శృతి హాసన్ లాంటి సెలెబ్రిటీలు కూడా పాపరాజీలపై చిందులు తొక్కిన సంగతి తెల్సిందే.

సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేస్తున్న వెటరన్ బ్యూటీ

గతంలో ఇలా ప్రవర్తించిన ఇతర సెలబ్రిటీలు

ఇక త్వరలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో కరీనా కపూర్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుండగా గీతా కపూర్, టెరెన్స్ లూయిస్, జావేద్ జాఫేరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. చూడాలి మరి ఒక వైపు షో, మరో వైపు ‘బ్రౌన్’ అనే క్రైమ్ డ్రామా సిరీస్ తో మళ్ళీ  సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేస్తున్న ఈ వెటరన్ బ్యూటీకి తాజా ఇష్యూ ఎంతవరకి మైనస్ అవుతుందో !

Karisma Kapoor asking Paparazzi not to Zoom too much by u/Red99it in BollyBlindsNGossip

కరిష్మా కపూర్ చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వయస్సు పెరగడం సహజమని, దానికి పాపరాజీలపై ఆగ్రహం అనవసరమని కొందరు అంటుంటే, సెలబ్రిటీలకు ప్రైవసీ హక్కులు ఉంటాయని మరికొందరు వాదిస్తున్నారు. ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.