
📌 Key Points
- దీప బిడ్డను వదులుకోవాలని చూడటం దశరథకు తెలుసని కాంచనకు వెల్లడి
- దశరథ్ నిజం దాచాడని పారిజాతం ఆరోపణ, శివ నారాయణ నిలదీత!
- కాంచన కన్నీటి పర్యంతం: కూతురిగా, చెల్లిగా, భార్యగా మోసపోయానని ఆవేదన
- స్వప్న మనసులో ఇంకా కాశీయే ఉన్నాడని స్పష్టం చేసిన కాశీ
కార్తీక దీపం 2 సీరియల్‌లో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీప తీసుకున్న ఒక సంచలన నిర్ణయం కాంచన జీవితాన్ని మార్చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
దీప నిర్ణయం గురించి కాంచనకు తెలిసిన షాకింగ్ నిజం!
Karthika Deepam 2 Serial March 14th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 14వ ఎపిసోడ్‌లో దీప బిడ్డను వద్దనుకుంటున్న విషయం దశరథకు తెలిసిన అని తెలియడంతో కాంచన తను అన్ని విధాలుగా మోసపోయినట్లు చెబుతుంది. పుట్టింట్లో నట్టింట్లో చనిపోయినట్లు, దశరథను చెల్లెమ్మా అని పిలవకూడదని చెబుతుంది.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బిడ్డను దీప వదులుకుంటున్న విషయం దశరథకు ముందే తెలుసు. తెలిసే నిజం దాచాడు అని పారిజాతం అంటుంది. ఈ నిజం ఎప్పుడు తెలుసు, ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదని నిలదీస్తాడు శివ నారాయణ.
నీ చేతిలో చేయి పెట్టి బిడ్డ జాగ్రత్త అన్నయ్య అని అడిగినప్పుడు అయినా నిజం చెప్పాలనిపించలేదా అని కాంచన అంటుంది. ఒక్కసారి నేను చెప్పేది విను అని దశరథ్ అంటుంటే.. కాంచన వినిపించుకోదు. శివ నారాయణ కూడా ఫీల్ అవుతాడు. డాడీ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పని అని జ్యోత్స్న అంటుంది. దాంతో దాసుతో జ్యో మాట్లాడింది గుర్తు చేసుకుంటాడు దశరథ్.
ఇక నాకు ఏ నిజం తెలియాల్సిన అవసరం లేదు. ఒక మోసపోయిన ఆడదానిలా మీ మేనత్త ఈరోజు పుట్టింట్లో ఈ నట్టింట్లో చచ్చిపోయినట్లే అని కాంచన అంటుంది. అందరా షాక్ అవుతారు. విధిరాత నాకు కాళ్లు లేకుండా చేస్తే మీరంతా కలిసి నన్ను చంపేశారు. కూతురుగా ఓడిపోయాను, చెల్లిగా మోసపోయాను, భార్యగా మోసపోయాను, ఒక తల్లిగా కూడా మోసపోయాను, అత్తగారిలా మోసపోయాను, ఒక మనిషిగా కూడా మోసపోయాను అని కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది.
దశరథ్‌ను నిలదీసిన శివ నారాయణ.. పారిజాతం ఆగ్రహం!
మరోవైపు కాశీ, స్వప్న మాట్లాడుకుంటారు. ఇదివరకు స్వప్న వెంట పడిన విషయం కాశీ చెబుతాడు. నన్ను నడి సముద్రంలో వదిలేశావ్ అని స్వప్న అంటుంది. నడి సముద్రం వరకు వెళ్తేనే అన్ని తెలుస్తాయని కాశీ అంటాడు. నచ్చితే కలవడం, నచ్చకుంటే విడిపోవడం, ఇదే జీవితం అన్నట్లుగా స్వప్న చెబుతుంది. మరి నుదుటి పాపిటలో సింధూరం ఎందుకు పెట్టుకున్నావని కాశీ అడుగుతాడు.
స్వప్న సైలెంట్ అవుతుంది. సింధూరం చెడిపోసి నీ మనసులో నుంచి నన్ను మర్చిపోయినట్లే. అలా నువ్వు చేయలేవు. నువ్వు నన్ను చెడిపేసింది మాటల్లో నుంచే మనసులో నుంచి కాదు. తీసేయాలంటే నా మీద నీకున్న ప్రేమ అబద్ధం అని ఒప్పుకోవాలి. అలా నువ్వు ఒప్పుకున్నావంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే అని కాశీ అంటాడు.
రోజ్ ఫ్లవర్‌ను స్వప్న చేతిలో పెడుతాడు కాశీ. తనకు తెలియకుండానే స్వప్న తీసుకుంటుంది. కాశీ వెళ్లిపోతాడు. స్వప్న ఆలోచనలో పడిపోతుంది. మళ్లీ కాశీ, స్వప్నల ప్రేమ మొదలైనట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత తెలియకుండానే ఫ్లవర్‌ను కింద పడేస్తుంది స్వప్న. మరోవైపు కాంచన అన్న మాటలు దీప గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ వచ్చి బాధపడాల్సిన అవసరం లేదు అని ఓదారుస్తాడు. దశరథ్ వచ్చి హాస్పిటల్‌కు వెళ్లారు అని నిలదీస్తాడు.
కాశీ, స్వప్నల మధ్య ప్రేమ.. మళ్ళీ మొదలైన ట్రాక్!
జ్యోత్స్నకు అనుమానం వచ్చింది. ఇదంతా తాతతో కలిసి ఇలా చేయించింది, అందరూ నా మీద రివర్స్ అయ్యారు. ఏం చేయలేకపోయాను. ఇంటికి వచ్చి ఇలా పంచాయితీ పెడతారనుకోలేదు. కానీ, అమ్మ దగ్గర నువ్వు మోసగాడిలా మిగిలిపోయావని కార్తీక్ అంటాడు. నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. దీపను తీసుకెళ్లు అని దశరథ్ అంటుండగా జ్యోత్స్న వింటుంది.
అమ్మను చూసి వెళ్దామని దీప అంటుంది. మరోవైపు దీప చెప్పింది తలుచుకుని ఎంతకు తెగించి సమాధానం చెప్పిందే, భలే దీప గుట్టు బయటపెట్టావ్. ఈ విషయం నీకు ఎలా తెలిసిందే అని పారిజాతం కంగారుగా అంటుంది. నువ్వె చెప్పావుగా అని జ్యో అంటుంది. అందరికంటే ఎక్కువగా దశరథ్ కంగారుపడుతున్నాడు అని పారు అంటే.. ఎంతైనా సొంత కూతురు కదా అని జ్యోత్స్న నే నోరు జారుతుంది.
ఏంటే.. ఏం అన్నావని పారిజాతం అంటుంది. ఎంతైనా సొంత కూతురులా చూసుకుంటున్నాడుగా అని జ్యో అంటే.. దీప మీద కాదు. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద. కాంచనను ఇంకాస్తా రెచ్చగొడితే.. దీపను ఇంటికి రానివ్వదు. కార్తీక్ గాడు గిలగిల కొట్టుకుంటాడు అని పారిజాతం అంటుంది. దీప ఇప్పుడు తలదించుకుని వెళ్లాలిగా. మళ్లీ మనం మొదలుపెట్టాలిగా అని జ్యోత్స్న అని వెళ్లిపోతుంది.
కార్తీక దీపం 2 సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. కాంచన తీసుకునే నిర్ణయం ఏమిటి? దీప ఏం చేయబోతోంది? మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి!


