
📌 Key Points
- కవిత సారథ్యంలోని ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం.
- మేడ్చల్ సభలో పార్టీ పేరు ప్రకటన, తెలంగాణ అస్తిత్వం రక్షణే లక్ష్యమని వెల్లడి.
- టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ, ఆసక్తి.
- ఈసీ గుర్తింపుతో పార్టీ కార్యకలాపాలు వేగవంతం, భవిష్యత్ కార్యాచరణ త్వరలో.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కల్వకుంట్ల కవిత సారథ్యంలోని నూతన పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’కు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈసీ గ్రీన్ సిగ్నల్‌తో పార్టీ కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి.
ఈసీ ఆమోదంతో కవిత పార్టీకి ఊపు
Telangana Rashtra Sena : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత సారథ్యంలో రూపుదిద్దుకున్న నూతన రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరును రిజిస్టర్ చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 25వ తేదీన మేడ్చల్ పరిధిలోని అద్వయ కన్వెన్షన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత తన కొత్త పార్టీ పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల ప్రయోజనాలను రక్షించడమే లక్ష్యంగా ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె అప్పట్లో ప్రకటించారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక అనుమతి లభించడంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి.
బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి చేరుకున్న ఎన్నికల సంఘం అధికారులు, పార్టీ రిజిస్ట్రేషన్ మరియు పేరు ఖరారుకు సంబంధించిన అధికారిక పత్రాన్ని ఆమెకు స్వయంగా అందజేశారు. ఇదే విషయాన్ని కవిత ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రతిబింబించేలా ‘ టీఆర్ఎస్ ‘ అనే సంక్షిప్త నామం వచ్చేలా పార్టీ పేరును ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
‘తెలంగాణ రక్షణ సేన’ లక్ష్యాలు, భవిష్యత్
నిజానికి కవిత ప్రకటించిన టీఆర్ఎస్ పేరుపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అసలు ఆ పేరుకు అనుమతి రాకపోవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా గతంలో ఇదే పేరుతో బీఆర్ఎస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేతలు కూడా కవిత పార్టీ పేరుపై స్పందిస్తూ… అనుమతి రాకపోవచ్చు అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు.
ఈ నెల 25న మేడ్చల్‌లో నిర్వహించిన సమావేశంలో కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)గా ప్రకటించారు. కానీయయయ తాజాగా ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుకు ఈసీ ఆమోదముద్ర వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
టీఆర్ఎస్ పేరుపై రాజకీయ చర్చ
కవిత నేతృత్వంలోని ‘తెలంగాణ రక్షణ సేన’ ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ జెండాను ఇప్పటికే ప్రకటించగా… ఎజెండాలోని కొన్ని అంశాలను కూడా ఇప్పటికే వెల్లడించారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఈ అధికారిక గుర్తింపుతో కవిత వర్గంలో ఉత్సాహం నెలకొంది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈసీ ఆమోదంతో కవిత వర్గంలో ఉత్సాహం నెలకొంది. ‘తెలంగాణ రక్షణ సేన’ రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ ప్రభావంపై అందరి దృష్టి నెలకొంది.


