
కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 17 (KBC 17)లో ఓ ఐదో తరగతి బాలుడి ప్రవర్తన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హాట్ సీట్‌లో అమితాబ్ బచ్చన్‌తో ఆ బాలుడు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అతడి అత్యుత్సాహంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Key Points
KBC 17 హాట్ సీట్‌లో ఐదో తరగతి విద్యార్థి ఇషిత్ భట్ పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించాడు.
అమితాబ్ బచ్చన్‌తో ఆ బాలుడు ప్రవర్తించిన తీరు, అతివిశ్వాసంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
ఏమీ గెలుచుకోకుండానే ఇషిత్ షో నుంచి నిష్క్రమించడంతో వీడియోలు వైరల్‌గా మారాయి.
అమితాబ్ ప్రదర్శించిన ఓర్పు, శాంత స్వభావంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి.
KBC 17లో బాలుడి ప్రవర్తన: విమర్శల వెల్లువ
కౌన్ బనేగా కరోడ్ పతి.. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వస్తోన్న ఈ షో ఎంతోమంది కష్టాలను వారి మేథస్సుతో తీర్చింది. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 17 (KBC 17) షో రన్ అవుతుండగా.. ఇటీవల షోలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. గుజరాత్ లోని గాంధీనగర్ కు చెందిన 5వ తరగతి విద్యార్థి ఇషిత్ భట్ హాట్ సీట్ కు చేరుకున్నాడు. చిన్నవయసులోనే హాట్ సీట్ కు వచ్చిన ఇషిత్ ను అమితాబ్ అభినందించారు. ఇక్కడి వరకూ అంతా బావుంది. ఆ తర్వాత ఆ బాలుడు అమితాబ్ తో ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది. పిల్లాడిని పెంచే పద్ధతి ఇదేనా అంటూ.. నెటిజన్లు అతని తల్లిదండ్రులపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు చిన్నపిల్లాడిని పట్టుకుని ఇలా మాట్లాడటం సిగ్గుచేటని కామెంట్స్ చేస్తున్నారు. ఆ పిల్లాడి విషయంలో సోషల్ మీడియా రెండుగా చీలింది.
అసలేం జరిగిందంటే.. ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ రౌండ్ గెలిచి హాట్ సీటుకు చేరుకున్న ఇషిత్.. అమితాబ్ రూల్స్ చెప్పకముందే తనకు రూల్స్ తెలుసని, కాబట్టి వివరించాల్సిన పనిలేదని అన్నాడు. సరే అని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు బిగ్ బీ. వరుసగా 4 ప్రశ్నలకు సమాధానాలు వెంటవెంటనే ఇచ్చిన ఇషిత్.. 5వ ప్రశ్న అడిగిన వెంటనే ఆప్షన్లు ఇచ్చేవరకూ కూడా వెయిట్ చేయకుండా.. అయ్యో.. ఆప్షన్స్ ఇవ్వండంటూ కంగారు పెట్టాడు. ఆప్షన్స్ ఇచ్చాక ఒక ఆన్సర్ సెలెక్ట్ చేశాడు. ఎప్పటిలాగే ఆ ఆన్సర్ ను లాక్ చేస్తున్నా అని అమితాబ్ అనగానే.. ఒకటేంటి.. నాలుగు లాక్స్ వేయండి.. అని అతివిశ్వాసం చూపించాడు. చివరికి ఆ ప్రశ్నకు ఇషిత్ చెప్పిన సమాధానం తప్పు అయింది. దీంతో ఎలాంటి ప్రైజ్ మనీ గెలుచుకోకుండానే షో నుంచి వెళ్లిపోయాడు.
నెటిజన్లలో చీలిక: అత్యుత్సాహంపై చర్చ
కానీ.. ఇషిత్ ఓవర్ కాన్ఫిడెన్స్, అత్యుత్సాహం ప్రదర్శించాడంటూ నెటిజన్లు వీడియోలను వైరల్ చేశారు. అయితే.. ఇషిత్ విషయంలో అమితాబ్ ప్రవర్తన తీరుపై మాత్రం నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఆయన ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా.. కొన్నిసార్లు పిల్లలు ఓవర్ కాన్ఫిడెన్స్ తో తప్పులు చేస్తుంటారన్నారు. ఆయన ఓపికను పలువురు నెటిజన్లు మెచ్చుకున్నారు.
అమితాబ్ బచ్చన్ ఓర్పుకు ప్రశంసలు
A post shared by Tanya Singh (@aarush_gf)
ఈ సంఘటన పిల్లలను పెంచే విధానం, షోలో పాల్గొనే వారి ప్రవర్తనపై చర్చకు దారితీసింది. అయితే, అమితాబ్ బచ్చన్ ప్రదర్శించిన ఓర్పు, మర్యాద మాత్రం అందరి ప్రశంసలు అందుకున్నాయి.


