
📌 Key Points
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కార క్రిమినల్ చర్యలకు హైకోర్టు ఆదేశం.
- విచారణ వీడియోలు షేర్ చేసి, జస్టిస్ స్వర్ణకాంత శర్మపై ఆరోపణలు చేసినందుకు చర్యలు.
- కేజ్రీవాల్, ఆప్ నేతలు తనపై పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెట్టారని జస్టిస్ శర్మ ఆగ్రహం.
- న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణించి, మార్ఫింగ్ వీడియోల ప్రచారంపై తీవ్ర అభ్యంతరం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. విచారణ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, జస్టిస్ స్వర్ణకాంత శర్మపై ఆరోపణలు చేసినందుకు ఢిల్లీ హైకోర్టు ఆయనపై కోర్టు ధిక్కార క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. ఇది న్యాయవ్యవస్థపై దాడిగా కోర్టు తీవ్రంగా పరిగణించింది.
కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కార చర్యలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు, జస్టిస్ స్వర్ణకాంత శర్మపై ఆరోపణలు చేసిన కేసులో కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కార క్రిమినల్ చర్యలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ పై మాత్రేమే కాకుండా ఆప్ నేతలు మనీష్ సిసోడియా, దుర్గేష్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్ లపై సైతం కోర్టు ధిక్కార క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. కేజ్రీవాల్, ఆ పార్టీ నేతలు తనపై అత్యంత దారుణమైన పదజాలంతో, పరువు నష్టం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని జస్టిస్ స్వర్ణకాంత శర్మ అన్నారు. ఇది న్యాయవ్యవస్థపై దాడికి పల్పడటమేనంటూ మండిపడ్డారు. ఎక్సైజ్ పాలసీ కేసును వేరే బెంచ్ విచారిస్తుందని, ఈలోగా తన కుటుంబానికి సంబంధించిన కేసు కాబట్టి కోర్టు ధిక్కరణ కేసును తాను విచారిస్తున్నానని చెప్పారు.
తాను కోర్టు ధిక్కరణ విచారణను ప్రారంభించినందున, లిక్కర్ పాలసీ కేసును మరో న్యాయమూర్తికి బదిలీ చేయడం మంచిదని అన్నారు. కేసు విచారణలో ఉండగానే సోషల్ మీడియాలో తనపై వ్యతిరేక ప్రచారం మొదలైందని తెలిపారు.అంతేకాకుండా కోర్టును లక్ష్యంగా చేసుకున్న కథనాలు ప్రసారం చేశారని ఇది రాజకీయ శక్తులు చేయించిన ప్రచారం అని ఆరోపించారు. మార్ఫింగ్ చేసిన వీడియోలతో తన కుటుంబ సభ్యులను రోడ్డుపైకి లాగి నిందలు వేశారన్నారు. ఇది తనను మాత్రమే కాకుండా న్యాయవ్యవస్థనే బయపెట్టడానికి జరిగిందని అన్నారు. హైకోర్టు ఆదేశాల తరవాత కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా కేసును కేజ్రీవాల్ సోషల్ మీడియాకు తీసుకువెళ్లారని ఆరోపించారు. ఒక లా కాలేజీలో తాను మాట్లాడిన వీడియోలను ఎడిట్ చేశారని చెప్పారు. కేజ్రీవాల్ తనను బెదిరించలేరని స్పష్టం చేశారు.
జస్టిస్ శర్మపై ఆరోపణలు, సోషల్ మీడియా ప్రచారం
న్యాయవ్యవస్థపై దాడిగా హైకోర్టు వ్యాఖ్యలు
కేజ్రీవాల్, ఆప్ నేతల చర్యలు న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నంగా హైకోర్టు అభివర్ణించింది. ఈ పరిణామాలు ఢిల్లీ రాజకీయాల్లో మరింత ప్రకంపనలు సృష్టించడం ఖాయం. తదుపరి చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.


