|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కేతిక శర్మ: రిలేషన్‌షిప్ డ్రామాలు నాకు నచ్చవు.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Published: 07-05-2025, 12:49 PM
కేతిక శర్మ: రిలేషన్‌షిప్ డ్రామాలు నాకు నచ్చవు.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కేతిక శర్మ, ‘రంగ రంగ వైభవంగా’ వంటి చిత్రాలతో మెప్పించింది. త్వరలో విడుదల కానున్న ‘సింగిల్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

Key Points

1

కేతిక శర్మ తన సినిమా ప్రయాణం గురించి మాట్లాడారు.

2

రిలేషన్‌షిప్ డ్రామాలు తనకు నచ్చవని ఆమె వెల్లడించారు.

4

అల్లు అరవింద్ సమర్పణలో సినిమా చేయడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

కేతిక శర్మ కెరీర్

యంగ్ బ్యూటీ కేతిక శర్మ (Ketika Sharma) ‘రొమాంటిక్’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా హిట్ అందుకోనప్పటీ.. కేతిక పర్ఫామెన్స్‌కు, ఎక్స్‌పోజింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో అవకాశాలు అందిపుచ్చుకుని ‘రంగ రంగ వైభవంగా, బ్రో, విజయ్ 69’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ ఏడాది స్పెషల్ సాంగ్‌లో కూడా మెరిసి అదరహో అనిపించింది. నితిన్ హీరోగా వచ్చిన ‘రాబిన్‌హుడ్’ చిత్రంలో ‘అది దా సర్‌ప్రైజ్’ సాంగ్‌లో స్టెప్పులు వేసి వావ్ అనిపించుకున్న కేతిక.. ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా నిటిస్తున్న ‘సింగిల్’ (Single) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఈ నెల 9 థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ‘సింగిల్’ విడుదల తేదీ దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేతిక శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘అల్లు అరవింద్‌(Allu Aravind)గారి సమర్ఫణలో ఓ మూవీ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. ఇప్పుడు కుదిరినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక కెరీర్ పరంగా నేను చాలా హ్యీపీగా ఉన్నాను. ఎందుకంటే హిట్ ఫ్లాప్స్ అనేవి మన చేతిలో ఉండవు. ఓ నటిగా పని చేయడం మాత్రమే నా చేతిలో ఉంది. ఇండస్ట్రీలో కొనసాగడం లక్‌గా భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను సింగిల్‌గా ఉన్నాను. రిలేషన్‌షిప్ అంటూ లేనిపోని డ్రామాలు నాకు నచ్చవు’ అని తెలిపింది.

‘సింగిల్’ సినిమా విడుదల

రిలేషన్‌షిప్‌లపై ఆమె అభిప్రాయం

కేతిక శర్మ తన సినిమా ప్రయాణం గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి తెలియజేసింది. ‘సింగిల్’ సినిమా విజయవంతం కావాలని ఆమె కోరుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.