|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాకు ట్విన్స్ పుట్టాలని ఉంది.. కియారా అద్వానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published: 14-05-2025, 12:46 AM
నాకు ట్విన్స్ పుట్టాలని ఉంది.. కియారా అద్వానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఆమె తనకు ట్విన్స్ పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయం నెట్టింట చర్చనీయాంశం అయింది.

కియారా అద్వానీ ప్రెగ్నెన్సీ వార్తలు

‘భరత్ అనే నేను’(Bharath Ane Nenu) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుంటూ ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తుంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాతో మన ముందుకు వచ్చింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి డిజాస్టర్‌గా నిలిచింది.

ట్విన్స్ కోరిక వెల్లడి

ప్రస్తుతం ఈ బ్యూటీ ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్లు టాక్. ఇక ఈ అమ్మడు వ్యక్తిగత విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్ర(Sidharth Malhothra)తో డేటింగ్‌లో ఉంటూ 2023లో పెళ్లి చేసుకుంది. ఇక అప్పటినుంచి ఓ పక్క సినిమాలతో మరో పక్క భర్తతో ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అయితే ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే.

నెటిజన్ల స్పందన

ఈ క్రమంలో ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. కియారా అద్వానీ అండ్ సిద్ధార్థ్ మల్హోత్రా తాము తల్లిదండ్రులు కాబోతున్నాము అని ప్రకటించిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ ఈ ముద్దుగుమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. నాకు హెల్తీ ట్విన్స్ పుట్టాలని అది కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టాలని ఆశగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై నెటిజన్లు కచ్చితంగా మీకు ట్విన్స్ పుడతారని కామెంట్స్ చేస్తున్నారు.

కియారా అద్వానీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె కెరీర్‌తో పాటు, తల్లి పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.