|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కింగ్డమ్ 2 ఉండదు: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు షాక్! నిర్మాత సంచలన ప్రకటన

Published: 02-01-2026, 12:00 AM
కింగ్డమ్ 2 ఉండదు: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు షాక్! నిర్మాత సంచలన ప్రకటన
  • విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా భారీ ఓపెనింగ్స్ వచ్చినా లాంగ్ రన్ లో నిలబడలేదు.
  • దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘కింగ్డమ్’ సీక్వెల్, ప్రీక్వెల్ ప్రకటించారు.
  • నిర్మాత నాగవంశీ ఇటీవల ‘కింగ్డమ్ 2’ సినిమా ఉండదని స్పష్టం చేశారు.
  • గౌతమ్ తిన్ననూరితో తమ నిర్మాణ సంస్థలో వేరే సినిమా ఉంటుందని నాగవంశీ వెల్లడించారు.

విజయ్ దేవరకొండ అభిమానులకు నిరాశ కలిగించే వార్త. ఇటీవల విడుదలైన ‘కింగ్డమ్’ సినిమా సీక్వెల్‌ ‘కింగ్డమ్ 2’ పై నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘కింగ్డమ్ 2’ సినిమా ఇప్పుడప్పుడే ఉండదని, దీనిపై ఆలోచన లేదని తెలిపారు. ఇది విజయ్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా కలవరపరిచింది.

కింగ్డమ్ సినిమాపై భారీ అంచనాలు, ఫలితం

కింగ్డమ్ సినిమా భారీ ఓపెనింగ్స్ వచ్చినా లాంగ్ రన్ లో నిలబడలేదు. (Vijay Deverakonda)

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఇటీవల కింగ్డమ్ సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. జెర్సీ లాంటి సూపర్ హిట్ తీసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా కావడంతో రిలీజ్ కి ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్ర చేసాడు. కింగ్డమ్ సినిమా భారీ ఓపెనింగ్స్ వచ్చినా లాంగ్ రన్ లో నిలబడలేదు. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కింగ్డమ్ సినిమాకు నష్టమే వచ్చింది అని టాలీవుడ్ టాక్.(Vijay Deverakonda)

మాస్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, సాంకేతికత విషయంలో అయితే కింగ్డమ్ చాలా బాగుంది. కానీ కథ పాతది అవడం, కథనం కూడా సింపుల్ గా ఉండటంతో కింగ్డమ్ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే కింగ్డమ్ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. ప్రీక్వెల్ లో విజయదేవరకొండ రాజు గా ఉన్న కథ ఉంటుంది. సీక్వెల్ లో విజయ్ శ్రీలంక లో ఒక జాతికి నాయకుడు అయ్యాక కథ ఉంటుంది.

సీక్వెల్, ప్రీక్వెల్ ప్రకటించినప్పటికీ..

అప్పుడే కింగ్డమ్ 2 ఉంటుందా అని సందేహాలు ఉన్నా దర్శకుడు, నిర్మాత మాత్రం ఉంటుందనే చెప్పారు. అయితే తాజాగా నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో కింగ్డమ్ సినిమా గురించి మాట్లాడుతూ.. కింగ్డమ్ 2 సినిమా ఉండదు. ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చు. జరిగిపోయిన దాన్ని తవ్వి గౌతమ్ ని బాధపెట్టడం తప్ప ఇంకేమి లేదు. గౌతమ్ తో మాత్రం వేరే సినిమా ఉంటుంది మా నిర్మాణ సంస్థలో అని తెలిపాడు.

నాగవంశీ సంచలన ప్రకటన: కింగ్డమ్ 2 ఉండదు!

దీంతో నాగవంశీ కామెంట్స్ చూస్తే అసలు కింగ్డమ్ 2 ఉండే ఛాన్స్ లేదనే అర్థమయిపోతుంది అని అంటున్నారు. గౌతమ్ తో వేరే సినిమా ఉంటుంది కానీ కింగ్డమ్ 2 మాత్రం ఉండదు అనడంతో విజయ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

నిర్మాత నాగవంశీ ప్రకటనతో ‘కింగ్డమ్ 2’పై అంచనాలు ఆవిరయ్యాయి. విజయ్ దేవరకొండ అభిమానులు సీక్వెల్ కోసం ఎదురుచూడటం వృధా అని తేలిపోయింది. గౌతమ్ తిన్ననూరితో వేరే సినిమా ఉంటుందని హామీ ఇచ్చినా, ‘కింగ్డమ్ 2’ లేదనే విషయం ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.