|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్లైన ఆరేళ్లకు గుడ్ న్యూస్ ప్రకటించిన బుల్లితెర యాక్టర్ లహరి సంజు కశ్యప్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

Published: 05-07-2025, 1:14 AM
పెళ్లైన ఆరేళ్లకు గుడ్ న్యూస్ ప్రకటించిన బుల్లితెర యాక్టర్ లహరి సంజు కశ్యప్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

స్టార్ మా లో ప్రసారమయ్యే ‘కోయిలమ్మ’ సీరియల్ నటి లహరి సంజు కశ్యప్ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆమె పెళ్లై ఆరేళ్ళు అయిన తర్వాత ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది.

Key Points

1

కోయిలమ్మ సీరియల్ నటి లహరి సంజు కశ్యప్ గుడ్ న్యూస్

2

పెళ్లైన ఆరేళ్ల తర్వాత తల్లి కాబోతున్న ఆనందం

4

నెటిజన్ల నుండి అభినందనల వరద

లహరి సంజు కశ్యప్ గుడ్ న్యూస్

స్టార్ మా(Star MAA)లో ప్రసారమయ్యే ‘కోయిలమ్మ’(Koilamma) సీరియల్ యాక్టర్ లహరి సంజు కశ్యప్(Lahari Sanju Kashyap) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్‌లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం అడపాదడపా సీరియల్స్‌ చేస్తూ బిజీగా ఉంది. అలాగే పలు టీవీ షోలతో అలరిస్తూ ఉంది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2019లో రాఘవేందర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి తన భర్తతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ చిన్నది ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ తెలిపింది. ఇన్‌స్టాలో తన భర్త అండ్ ఆమె చిన్న బేబీ షర్ట్ పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘మన చిన్న ఆనందపు మూట త్వరలో రాబోతోంది.. నాలో సగం, నా ప్రేమలో సగం అయిన ఈ చిన్న వ్యక్తిని కలవడం చాలా సంతోషంగా ఉంది’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా ఈ చిన్నది పెళ్లైన ఆరేళ్లకు తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. Link

సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్

అభిమానుల నుండి అభినందనలు

లహరి సంజు కశ్యప్ తల్లి కాబోతున్న సంతోషకరమైన వార్తతో అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.