|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కోట శ్రీనివాసరావు మృతి… బాలయ్య ఎమోషనల్ పోస్ట్

Published: 13-07-2025, 1:48 AM
కోట శ్రీనివాసరావు మృతి... బాలయ్య ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి చెందడంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఈ విషాద ఘట్టంపై నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంతో ప్రేక్షకులను అలరించిన కోట శ్రీనివాసరావు గారి మరణం టాలీవుడ్‌కు తీరని లోటు.

Key Points

1

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి.

2

బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్ ద్వారా సంతాపం.

4

చిరంజీవి కూడా సంతాపం వ్యక్తం చేశారు.

కోట శ్రీనివాసరావు మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ( Kota Srinivasa Rao) ఇవాళ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో నందమూరి బాలయ్య (Nandamuri Balakrishna) ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన… కోట శ్రీనివాసరావు… తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని బాలయ్య వెల్లడించారు.

తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసారని గుర్తు చేశారు. ఇతర భాషల్లో కూడా.. నటించి మెప్పించిన ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుందన్నారు. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. రాజకీయాల్లో కూడా చురుగ్గా పని చేశారని గుర్తు చేశారు బాలయ్య. ఆయన మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు అని వెల్లడించారు. కోట శ్రీనివాసరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో కోట శ్రీనివాసరావు మృతి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. కోట శ్రీనివాసరావు లాంటి నటుడిని కోల్పోవడం.. బాధాకరంగా ఉందని చెప్పారు. కోట శ్రీనివాసరావు ఇక లేరన్న వార్త తనను కల్చివేసిందని ఎమోషనల్ అయ్యారు.

బాలకృష్ణ సంతాపం

చిరంజీవి స్పందన

కోట శ్రీనివాసరావు గారి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. ఆయన సేవలను ఎప్పటికీ మనం గుర్తుంచుకుంటాం.

Related News

Tags
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.