|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కూలీ టికెట్ల కోసం ఎలా ఎగబడ్డారో చూడండి.. గంటల్లోనే 2 లక్షల టికెట్లు అమ్ముడైపోయాయి.. సూపర్ స్టార్ క్రేజ్ మామూలుగా లేదు

Published: 08-08-2025, 11:42 AM
కూలీ టికెట్ల కోసం ఎలా ఎగబడ్డారో చూడండి.. గంటల్లోనే 2 లక్షల టికెట్లు అమ్ముడైపోయాయి.. సూపర్ స్టార్ క్రేజ్ మామూలుగా లేదు

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. కేరళలో గంటల్లోనే 2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

కూలీ సినిమాకు అభిమానుల అద్భుత ఆదరణ

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘కూలీ’, ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. శుక్రవారం (ఆగస్టు 9) సినిమా నిర్మాతలైన సన్ పిక్చర్స్ తమ ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో కేరళలోని ఒక థియేటర్ వద్ద ‘కూలీ’ టికెట్ల కోసం రజినీకాంత్ అభిమానులు పరుగులు పెట్టడం చూడొచ్చు.

రజనీకాంత్ నటించిన కూలీ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ పై స్పష్టంగా కనిపిస్తోంది. కూలీ సినిమాకు కేరళలో ఉన్న క్రేజ్ గురించి చెబుతూ సన్ పిక్చర్స్ ఓ వీడియో రిలీజ్ చేసింది.

“కేరళలోని త్రిస్సూర్‌లో కూలీ అడ్వాన్స్ బుకింగ్‌కు అభిమానుల భారీ ఆదరణ” అంటూ సన్ పిక్చర్స్ తమ ఎక్స్ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోలో, వందల మంది అభిమానులు ‘కూలీ’ టికెట్ల కోసం థియేటర్ గేట్ల వద్ద వేచి ఉన్నారు. గేట్లు తెరవగానే వాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ, పరుగులు పెడుతూ ‘కూలీ’ మొదటి రోజు మొదటి షో టికెట్లు తీసుకోవడానికి ప్రయత్నించారు.

కేరళలో భారీ టికెట్ల అమ్మకాలు

Sacnilk రిపోర్టు ప్రకారం, కేరళలో ‘కూలీ’ అడ్వాన్స్ బుకింగ్ భారీగా ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు 2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. గంటకు 50 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ‘కూలీ’ ఇప్పటికే కేరళలో రూ.3 కోట్లు వసూలు చేసింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఈ రిపోర్టు ప్రకారం ఓవర్సీస్ లో కూడా ‘కూలీ’ భారీ ఓపెనింగ్స్ సాధించవచ్చని, మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే రూ.30 కోట్లకు చేరుకుందని పేర్కొంది. విజయ్ నటించిన ‘లియో’ రికార్డును కూలీ బ్రేక్ చేయొచ్చని భావిస్తున్నారు. ఓ తమిళ సినిమాకు వచ్చిన రూ.66 కోట్ల ఓవర్సీస్ ఓపెనింగ్ రికార్డును ఇది అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

రజినీకాంత్ క్రేజ్‌కు నిదర్శనం

కళానిధి మారన్ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించిన కూలీ సినిమాలో రజినీకాంత్, నాగార్జున అక్కినేని, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. రచితా రామ్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్, కన్నా రవి, మోనిషా బ్లెస్సీ, కాళి వెంకట్ సహాయక పాత్రలు పోషించారు. ఆమిర్ ఖాన్ కూడా సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. అదే రోజు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్.టి.ఆర్. నటించిన ‘వార్ 2’ కూడా విడుదలవుతుంది. ఆ మూవీ కూడా తెలుగులో రానుండటంతో ఈ రెండింటి మధ్య తెలుగు రాష్ట్రాల్లో పోటీ ఆసక్తి రేపుతోంది.

రజినీకాంత్ అభిమానుల ఆదరణతో ‘కూలీ’ సినిమాకు భారీ విజయం దక్కుతుందని అంచనా. అడ్వాన్స్ బుకింగ్స్‌తో సినిమా ఇప్పటికే రికార్డులు బద్దలు కొడుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.