|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంచు లక్ష్మి విధ్వంసం: ‘లేచింది మహిళా లోకం’ ట్రైలర్ విడుదల! లాయర్ పాత్రలో అరాచకం!

Published: 09-03-2026, 9:35 AM
మంచు లక్ష్మి విధ్వంసం: 'లేచింది మహిళా లోకం' ట్రైలర్ విడుదల! లాయర్ పాత్రలో అరాచకం!
  • మంచు లక్ష్మి లాయర్ పాత్రలో అరాచకం సృష్టిస్తూ ‘లేచింది మహిళా లోకం’ ట్రైలర్‌లో కనిపించారు.
  • కొత్తగా పెళ్లయిన జంట మధ్య విభేదాలను ఇరుగుపొరుగు వారు ఎలా పెంచుతారో ఈ చిత్రం చూపిస్తుంది.
  • శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల జంటగా నటించిన ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది.
  • కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో హరితేజ, హేమ, శ్రద్ధాదాస్ ముఖ్య పాత్రలు పోషించారు.

‘లేచింది మహిళా లోకం’ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మంచు లక్ష్మి లాయర్ పాత్రలో అద్భుతంగా నటించారు. కొత్తగా పెళ్లయిన జంటల మధ్య తలెత్తే సమస్యలను ఈ చిత్రం ద్వారా చూపించనున్నారు. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది.

ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్

Lechindi Mahila Lokam: బ్రిహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘లేచింది మహిళాలోకం’ (Lechindi Mahila Lokam). దర్శకద్వయం అర్జున్-కార్తిక్ రూపొందించిన ఈ చిత్రానికి హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తంగా నిర్మించారు. మంచు లక్ష్మి (Manchu Lakshmi), శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా సన్‌స్టూడియో యూఎఫ్‌ఓతో కలిసి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. మార్చి 26న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ (Lechindi Mahila Lokam Trailer) ఎలా ఉందంటే..

సినిమా కథాంశం

కొత్తగా పెళ్లయిన ఒక జంట మధ్య చిన్న చిన్న విషయాలకే విబేధాలు రావడం.. వాటికి ఆజ్యం పోసేలా పక్కింటివాళ్లు తమ మాటలతో పొల్యూట్ చేయడం.. ఈ క్రమంలో జరిగే పరిణామాలు ఒకవైపు.. థ్రిల్‌కు గురి చేస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ప్రస్తుత సమాజానికి చాలా రిలేటెడ్‌గా ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకద్వయం అర్జున్-కార్తిక్ ఈ సినిమాను హిలేరియస్‌గా రూపొందించారనే విషయాన్ని ట్రైలర్‌లోని ప్రతి షాట్ స్పష్టం చేస్తుంది. కొత్తగా పెళ్లయిన జంటగా ఇందులో శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల నటించారు. వారి మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తే, వాటికి మరింత ఆజ్యం పోస్తూ.. ఇద్దరికీ విడాకులు ఇచ్చేంత వరకు ఇరుగు పొరుగు వారు ప్రవర్తించడం ఇందులో చూపించారు.

నటీనటులు మరియు విడుదల వివరాలు

ప్రస్తుతం సమాజంలో కూడా అదే జరుగుతున్న విషయం తెలియంది కాదు. ఎవరైనా భార్యభర్తలు కొట్టాడుకుంటుంటే, మనకెందుకులే అని అసలు పట్టించుకోకుండా, ఎవరి పని వారు చూసుకునే టైప్ కొందరైతే, వారి మధ్య మరింతగా విభేదాలు సృష్టించి ఆనందం పొందేవారు మరో టైపు. వీరిద్దరూ కాకుండా, ఇద్దరినీ విడగొట్టాలని చూసే వారు ఇంకో టైపు. ఆ ఇంకో టైపు పాత్రలోనే మంచు లక్ష్మి ఇందులో నటించారు. ‘లాయర్ పుష్ప’గా ఆమె ఎంట్రీ, తన తండ్రి డైలాగ్‌‌పై పంచ్, చివరిలో తన డిక్షన్‌కు సంబంధించిన పంచ్.. మొత్తం బాగా పేలాయి. హేమ, హరితేజ సుప్రిత, శ్రద్ధాదాస్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషించినట్లుగా ఈ ట్రైలర్‌లో చూపించారు. టెక్నికల్‌గా అంత గొప్పగా ఏం లేకపోయినా, ఎంటర్‌టైన్‌మెంట్‌కు మాత్రం లోటుండదని ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. మరి మహిళల భవిష్యత్ ఏంటో తెలియాలంటే మాత్రం మార్చి 26 వరకు వెయిట్ చేయాల్సిందే.

మొత్తానికి ‘లేచింది మహిళా లోకం’ చిత్రం ప్రస్తుత సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబిస్తూ, ప్రేక్షకులకు ఒక మంచి సందేశాన్ని అందించేలా ఉందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మార్చి 26న సినిమా విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.