
📌 Key Points
- నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ఫిబ్రవరి 14న రీ రిలీజ్ కానుంది.
- శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2021లో విడుదలై విజయం సాధించింది.
- నాగచైతన్య ఈ సినిమా తన హృదయానికి దగ్గరైనదని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
- ఈ సినిమాలోని పాటలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘లవ్ స్టోరీ’ వాలెంటైన్స్ డే సందర్భంగా రీ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని నాగచైతన్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అభిమానులు థియేటర్లలో ఈ సినిమాను సెలెబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
ఫిబ్రవరి 14న ‘లవ్ స్టోరీ’ రీ రిలీజ్
Love Story Re release: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ సినిమాల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి నెల ఎన్నో సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వాలెంటైన్స్ డే(Valentine’s Day ) సందర్భంగా మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి నెలలో కొన్ని కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. వీటితోపాటు మరి కొన్ని సినిమాలను కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే కావడంతో ఆరోజు కల్ట్ క్లాసిక్ ‘లవ్ స్టోరీ’ (Love Story)రీ రిలీజ్ చేయబోతున్నారు.
ఇలా నాగచైతన్య(Nagachaitanya) సాయి పల్లవి (Sai Pallavi)హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ హిట్ సినిమా లవర్స్ డే సందర్భంగా తిరిగి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. దీంతో అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా 2021 సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో పాటలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని నాగచైతన్య తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. లవ్ స్టోరీ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైనా సినిమా. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ తిరిగి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నాను. మరోసారి మీ అందరితో కలిసి థియేటర్లో ఈ సినిమాని సెలెబ్రేట్ చేసుకుందాం అంటూ నాగచైతన్య లవ్ స్టోరీ రీ రిలీజ్ గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో తండేల్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.
నాగచైతన్య భావోద్వేగ పోస్ట్
A film very close to my heart #LoveStory is Re-releasing on February 14th. Excited for this , looking forward to celebrating in theaters with you all again . #MagicalBlockBusterLovestory @sekharkammula @Sai_Pallavi92 @SVCLLP @AsianSuniel #PusukurRamMohanRao #BharatNarang … pic.twitter.com/20uv8KrXiH
— chaitanya akkineni (@chay_akkineni) January 22, 2026
‘లవ్ స్టోరీ’ సినిమా విశేషాలు
నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే తండేల్ మంచి సక్సెస్ అందుకున్న అనంతరం చైతన్య విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వర్షకర్మ(Vrusha Karma) అనే సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా మైథాలజికల్ పిరియాడిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. చైతన్య కెరియర్ లోనే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని చెప్పాలి. ఇందులో నాగచైతన్యకు జోడిగా నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary)హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాని 2026 జూన్ లేదా జూలై నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మొత్తానికి ‘లవ్ స్టోరీ’ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. నాగచైతన్య అభిమానులు ఈ సినిమాను మళ్ళీ చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


