|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గ్యాస్ కొరతతో హాస్టళ్లలో అలజడి! టీ, కాఫీలకు బ్రేక్.. విద్యార్థుల భోజనంపై పెను ప్రభావం!

Published: 11-03-2026, 4:05 AM
గ్యాస్ కొరతతో హాస్టళ్లలో అలజడి! టీ, కాఫీలకు బ్రేక్.. విద్యార్థుల భోజనంపై పెను ప్రభావం!
  • వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల కొరతతో హాస్టళ్లలో టీ, కాఫీ బంద్
  • చపాతీ, దోసె, పూరీ వంటి అల్పాహారాలు నిలిపివేత
  • గ్యాస్ కొరతతో హోటళ్లు మూసివేసే పరిస్థితి
  • విద్యార్థులు, ఉద్యోగులపై భోజన ప్రభావం

తెలంగాణలోని హాస్టళ్లలో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీ, కాఫీలను నిలిపివేయడంతో పాటు, అల్పాహారంలో కోతలు విధించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.

హాస్టళ్లలో వంట గ్యాస్ కష్టాలు

తెలంగాణలోని హాస్టళ్లలో వంట గ్యాస్ కష్టాలు మెుదలయ్యాయి. మెుత్తం ఫీజు కడుతున్నా.. హాస్టళ్లలో ఉండేవారికి మీద ప్రభావం పడుతుంది. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో కొరత కారణంగా హాస్టళ్లకు తాత్కాలికంగా టీ, కాఫీ అందించరాదని హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టళ్ల సంఘం ప్రకటించింది. టిఫిన్లు, ఇతర సమయం తీసుకునే లేదా అధిక నూనె వినియోగించే అల్పాహార వస్తువులను మెనూలో నుంచి తీసేయాలని తెలిపింది.

అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నందున అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. చపాతీ, దోసె, పూరీ, ఇతర సమయం తీసుకునే లేదా అధిక నూనెకు కారణం అయ్యే అల్పాహారం వస్తువులను మినహాయించాని అసోసియేషన్ పేర్కొంది. తాత్కాలికంగా టీ, కాఫీని అందించరాదని అసోసియేషన్ హాస్టళ్లకు పంపిన సందేశంలో స్పష్టం చేసింది. పరిస్థితి, కొరతను బట్టి కొన్ని కూరలు, అదనపు ఆహార పదార్థాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చని తెలిపింది.

గ్యాస్ కొరత పరిస్థితి మెరుగుపడే వరకు బియ్యం, ఇతర ప్రాథమిక భోజనం వంటి ఆహార పదార్థాలు మాత్రమే అందిస్తారు. స్వయంగా వంట చేసుకునే సౌకర్యాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ‘అన్ని హాస్టల్ యజమానులు ప్రత్యామ్నాయ వంట పద్ధతులను అమలు చేయాలి. దయచేసి పరిస్థితి గురించి గెస్ట్‌లకు తెలియజేయాలని మేం అభ్యర్థిస్తున్నాం.’ అని అసోసియేషన్ తెలిపింది.

హోటళ్ల మూసివేతకు తెలంగాణ అసోసియేషన్ సిద్ధం

గ్యాస్ సిలిండర్ కొరతను ఎదుర్కొంటున్నామని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ వెల్లడించింది. గ్యాస్ వినియోగాన్ని తగ్గించడానికి, పరిస్థితిని నిర్వహించడానికి, పరిస్థితి మెరుగుపడే వరకు అన్ని హాస్టల్ యజమానులు మార్గదర్శకాలను పాటించాలని అభ్యర్థించింది.

మరోవైపు ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా అందుబాటులోకి రాకపోతే ఒకటి లేదా రెండు రోజుల్లో 60 శాతానికి పైగా హోటళ్లు మూసివేయాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. తగినంత స్టాక్‌లు ఉన్న పెద్ద హోటళ్లు ఒక వారానికి సరిపడా నిర్వహించగలవు. కానీ చిన్నవి రెండు రోజుల్లోనే మూసివేయవలసి రావచ్చని తెలిపింది.

విద్యార్థులపై ప్రభావం

తెలంగాణ అంతటా 40,000-50,000 రెస్టారెంట్లు ఉన్నాయని, వాటిలో హైదరాబాద్‌లోని 20,000 హోటళ్లు ఉన్నాయని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. హోటళ్ల క్లోజ్ అయితే.. కేవలం టూరిస్టులు, ట్రావెలర్స్ మీద మాత్రమే కాకుండా వర్కర్స్, ఉద్యోగులు, విద్యార్థుల మీద కూడా ప్రభావం పడుతుందన్నారు.

కమర్షియల్ ఎల్పీజీతో తెలంగాణలోని హోటళ్ల యజమానులు తమ కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా ఆలస్యం అయితే, ఒకటి లేదా రెండు రోజుల్లో రాష్ట్రంలో 60 శాతం కంటే ఎక్కువ హోటళ్ల కార్యకలాపాలను మూసివేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

రాష్ట్రంలో గ్యాస్ కొరత కొనసాగితే హోటళ్లు మూతపడే ప్రమాదం ఉంది. దీని ప్రభావం సామాన్యులు, విద్యార్థులు, ఉద్యోగులపై పడుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.