|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూపులు! తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సిలిండర్ల సంఖ్య తెలిస్తే షాక్ అవుతారు!

Published: 03-04-2026, 12:35 AM
గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూపులు! తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సిలిండర్ల సంఖ్య తెలిస్తే షాక్ అవుతారు!
  • తెలంగాణలో 15 లక్షలకు పైగా సిలిండర్ల డెలివరీ పెండింగ్‌లో ఉంది.
  • సోషల్ మీడియాలో ఎల్పీజీ కొరత ప్రచారం పెరగడంతో బుకింగ్స్ ఎక్కువయ్యాయి.
  • కొత్త లాక్ సిస్టమ్ విధానం కూడా సిలిండర్ల సరఫరాకు ఆటంకం కలిగిస్తోంది.
  • హైదరాబాద్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 400 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం కొరత లేదని చెబుతున్నా, లక్షలాది సిలిండర్లు డెలివరీకి పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి గల కారణాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుందాం.

తెలంగాణలో సిలిండర్ల కొరతకు కారణాలు

తెలంగాణలో ఎల్పీజీపై జనాల్లో ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఓ వైపు ప్రభుత్వం ఎల్పీజీ కొరత లేదని ప్రకటనలు జారీ చేస్తున్నా.. ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సిలిండర్లు బుక్ అయ్యాయి. ఇప్పుడు వాటిని డెలివరీ చేసేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

తెలంగాణలో 15 లక్షలకుపైగా సిలిండర్ల డెలివరీ పెండింగ్‌లో ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సోషల్ మీడియా లో జరిగిన ప్రచారం కూడా ఇన్ని బుకింగ్స్‌కు ఒక కారణంగా చెప్పవచ్చు. వీటన్నింటినీ సరఫరా చేసేందుకు వారం రోజులపైనే పడుతుంది. లాక్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ సమస్యలతో గ్యాస్ బుకింగ్స్ సంఖ్య తగ్గింది. అయితే సరఫరా వ్యవస్థలో లోపాలతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం. బుక్ చేసిన తర్వాత కస్టమర్ ఇంటికి సిలిండర్ వచ్చేందుకు రెండుమూడు వారాలపైనే పడుతుంది.

తెలంగాణలో 1.30 కోట్ల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. నార్మల్ డేస్‌లో 2.15 లక్షల బుకింగ్స్ ఉంటాయి. అయితే యుద్ధానికి ముందు రోజూవారీ పెండింగ్ 3.50 లక్షల ఉండేవి. ఇందులో 2.15 లక్షల సిలిండర్లు సరఫరా జరిగేవి. మిగిలినవి మరుసటి రోజు చేస్తుండేవారు. ఇప్పుడు డెలివరీ కావాల్సినవి 15 లక్షలు ఉన్నాయి.

పెండింగ్‌లో ఉన్న సిలిండర్ల సంఖ్య

సిలిండర్ల డెలివరీ వేగంగా జరిగితే ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. నిజానికి పశ్చిమాసియా ఉద్రిక్తతలు మెుదలై.. సోషల్ మీడియాలో ఎల్పీజీ కొరత అంటూ ప్రచారం అవ్వడంతో బుకింగ్స్ ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో సిస్టమ్ లాక్ పద్ధతిని అమలులోకి తెచ్చింది కేంద్రం. బుకింగ్‌ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో సింగిల్‌ సిలిండర్‌ ఉంటే… 25 రోజులు, డబుల్‌ సిలిండర్లు ఉంటే 35 రోజుల లాక్‌ సిస్టమ్ అమలు చేస్తోంది.

ఇరాన్‌పై అమెరికా -ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా రవాణాకు అంతరాయం ఏర్పడి, సరఫరా కొరత తలెత్తిన నేపథ్యంలో మరోవైపు ఎల్‌పీజీ సిలిండర్ల నిల్వలను అరికట్టడానికి అధికారులు దాడులను ముమ్మరం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఒక స్మశానవాటికలో సుమారు 400 సిలిండర్లు లభ్యమయ్యాయి. అక్కడ పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రమేయం ఉన్న పంపిణీదారుడిని సస్పెండ్ చేశారు.

నిందితులు శ్మశానవాటిక నుండి వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్లను ప్రస్తుత మార్కెట్ ధర కన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. సుమారు రూ. 2,100 ఖరీదు చేసే ఒక వాణిజ్య సిలిండర్‌ను రూ. 6,000 వరకు అమ్మినట్లు తేలింది.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు

స్వాధీనం చేసుకున్న సిలిండర్లు , నిందితులు ఉపయోగించిన కొన్ని వాహనాల మొత్తం విలువ దాదాపు రూ. 22 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవని ప్రభుత్వం చెబుతున్నా.. చాలా మంది పట్టించుకోవడం లేదు.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

సిలిండర్ల సరఫరాను వేగవంతం చేస్తేనే ప్రజలకు ఊరట లభిస్తుంది. ప్రభుత్వం సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలి. అక్రమ నిల్వలపై నిఘా ఉంచడం కూడా అవసరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.