
📌 Key Points
- ప్రధాని మోదీ జీవితం ఆధారంగా ‘మా వందే’ బయోపిక్ నిర్మాణం
- నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు
- హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం యూనిట్
- పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ విడుదల కానున్న సినిమా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ‘మా వందే’ పేరుతో బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ మోదీ పాత్రలో నటిస్తున్నారు. మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
‘మా వందే’ చిత్రంలో నరేంద్ర మోదీగా ఉన్ని ముకుందన్
Maa Vande: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ (PM Narendra Modi Biopic) ‘మా వందే’ (Maa Vande) అనే టైటిల్‌తో గ్రాండ్‌గా నిర్మాణం జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత వీర్ రెడ్డి. ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan) నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా.. తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిచ్చేలా ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు క్రాంతికుమార్. సీహెచ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్‌తో ఈ బయోపిక్‌ను రూపొందిస్తున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించి ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్‌ను వారు తెలియజేశారు. ఈ అప్డేట్ ఏంటంటే..
హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి.. కశ్మీర్‌కు ప్రయాణం
‘మా వందే’ చిత్రం హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మొదటి షెడ్యూల్ షూటింగ్‌లో సినిమాలోని పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించామని తెలుపుతూ.. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను టీమ్ విడుదల చేసింది. ఈ స్టిల్స్ గమనిస్తే.. టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉన్ని ముకుందన్ కూడా ఈ ఫొటోలో సరదాగా టీమ్‌తో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే అప్డేట్‌లో ‘మా వందే’ నెక్ట్స్ షెడ్యూల్ కోసం కశ్మీర్ వెళ్తున్నట్లుగా టీమ్ మెంబర్స్ తెలిపారు. ఈ సినిమాను పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్డేట్.. మంచి స్పందనను రాబట్టుకుంటోంది.
పాన్ ఇండియా స్థాయిలో విడుదల.. భారీ బడ్జెట్‌తో నిర్మాణం
ఇక ఈ సినిమాను సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ సంస్థ హ్యూజ్ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం 400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టుబోతున్నారట. ఈ స్టోరీ డ్రివెన్ మూవీని ప్రపంచంలోనే తొలిసారిగా ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆక్వామ్యాన్’లో హీరోగా నటించిన జేసన్ మమొవాను ‘మా వందే’ చిత్రంలో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ వంటి స్టార్ యాక్టర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డీవోపీ కె.కె. సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ వంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశామని, త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు తెలిపారు.
ప్రధాని మోదీ జీవిత కథతో వస్తున్న ఈ బయోపిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.


