
వడివేలు, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మారీసన్’ చిత్రం నెట్‌ఫ్లిక్స్ మరియు సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తితో దొంగ యొక్క ప్రయాణాన్ని ఈ చిత్రం తెలియజేస్తుంది.
Key Points
ఫహద్ ఫాజిల్, వడివేలు నటించిన ‘మారీసన్’ ఓటీటీలో విడుదల
నెట్‌ఫ్లిక్స్ మరియు సింప్లీ సౌత్ లో అందుబాటులో ఉంది
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రసారం
మతిమరుపు వ్యక్తితో దొంగ యొక్క ప్రయాణం ఆధారంగా కథ
‘మారీసన్’ ఓటీటీ విడుదల వివరాలు
వడివేలు, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘మారీసన్’ (Maareesan) ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ ఇద్దరు విలక్షణ నటులు యాక్ట్ చేసిన ఈ సినిమా ఇవాళ (ఆగస్టు 22) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీని ఓటీటీలో ఎక్కడ వీక్షించాలో చూసేద్దాం. ఈ సినిమా ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది.
తమిళ కామెడీ థ్రిల్లర్ మారీసన్ ఓటీటీ లోకి వచ్చేసింది. శుక్రవారం రెండు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో ఈ మూవీ అడుగుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్ తో పాటు సింప్లీ సౌత్ ఓటీటీల్లో ఈ మూవీ ప్రసారమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. సింప్లీ సౌత్ లో ఔట్ సైట్ ఇండియా ఆడియన్స్ ఈ మూవీని చూడొచ్చు. ఈ ఓటీటీలో మారీసన్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఉంది.
ఫహద్ ఫాజిల్ మరియు వడివేలు కీలక పాత్రలు
ఈ ఏడాది జులై 25న థియేటర్లలో రిలీజైన మారీసన్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నెల రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీ డెబ్యూ చేసింది. అయితే థియేటర్లో ఒకే రోజు రిలీజైన మారీసన్, తలైవన్ తలైవి ఇప్పుడు ఓటీటీలోనూ ఒకే తేదీనాడు స్ట్రీమింగ్ కు వచ్చాయి. మారీసన్ లో ఫహద్ ఫాజిల్ , వడివేలు కీలక పాత్రలు పోషించారు. వీళ్ల యాక్టింగ్ తో సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లారు.
మారీసన్ సినిమాకు సుధీర్ శంకర్ డైరెక్టర్. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వేలాయుధం (వడివేలు)తో కలిసి ప్రయాణం మొదలుపెట్టే దయా (ఫహద్) అనే దొంగ కథ ఇది. వేలాయుధాన్ని దోచుకోవాలనే ఉద్దేశ్యంతో దయా వెళ్తాడు. అయితే ఈ ప్రయాణం వారి జీవితాలను శాశ్వతంగా మారుస్తుంది. సస్పెన్స్ తో సాగే ఈ మూవీలో చివరకు వీళ్లిద్దరి కథ ఎలాంటి మలుపు తీసుకుందనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. కలైసెల్వన్ శివాజీ సినిమాటోగ్రఫీ అందించారు.
కథాంశం మరియు ప్రేక్షకుల స్పందన
ఈ చిత్రం విడుదలైన తరువాత పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. దిగ్గజ నటుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తన ఎక్స్ ఖాతాలో కమల్ ఇలా పేర్కొన్నారు. “మారీసన్ – తెలివితేటలు, లోతు మధ్య అప్రయత్నంగా నృత్యం చేసే సినిమా. దాని క్రాఫ్ట్ నన్ను నవ్విస్తుంది, ఆలోచిస్తుంది, ప్రశంశలు కురిపించేలా చేస్తుంది. ఈ ఆనందకరమైన సృష్టికి వారిని అభినందించే క్రమంలో టీమ్ తో అద్భుతమైన సంభాషణ జరిగింది” అని కమల్ అన్నారు.
ఫహద్ ఫాజిల్ మరియు వడివేలు నటనతో ఆకట్టుకున్న ‘మారీసన్’ సినిమా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందే అవకాశాలున్నాయి. కథాంశం, నటన, సంగీతం ప్రేక్షకులను ఆకర్షిస్తాయి.


