|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్లికి ముందు నమ్రతకు మహేష్‌ బాబు పెట్టిన కండీషన్‌ ఏంటో తెలుసా? అందుకే సంచలన నిర్ణయం

Published: 13-06-2025, 3:04 AM
పెళ్లికి ముందు నమ్రతకు మహేష్‌ బాబు పెట్టిన కండీషన్‌ ఏంటో తెలుసా? అందుకే సంచలన నిర్ణయం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రత శిరోద్కర్ల ప్రేమ వివాహం ఇప్పటికీ చర్చనీయాంశం. వారి పెళ్లికి ముందు మహేష్ ఒక కండిషన్ పెట్టాడని, దాని వల్ల నమ్రత సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

Key Points

1

మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ప్రేమ వివాహం

2

పెళ్లికి ముందు మహేష్ పెట్టిన షరతు: వర్కింగ్ ఉమెన్ కాకూడదు

4

ఫ్యామిలీ, పిల్లల కోసం నమ్రత త్యాగం

మహేష్, నమ్రత ప్రేమకథ

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, హీరోయిన్‌ నమ్రత శిరోద్కర్‌ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. `వంశీ` సినిమా సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొంత కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

అయితే వీరి పెళ్లికి ముందుగా సూపర్‌ స్టార్‌ కృష్ణ ఒప్పుకోలేదని సమాచారం. ఆయన నో చెప్పడంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అంటుంటారు. మహేష్‌ ప్రేమకి సంబంధించి అక్క మంజుల తండ్రితో రాయబారం నడిపించారట.

మొత్తానికి మహేష్‌, నమ్రతల పెళ్లికి కృష్ణ ఒప్పుకున్నారు. ఆ తర్వాత అంతా కలిసిపోయారు. మహేష్‌ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఇప్పుడు నమ్రతనే చూసుకుంటుందని సమాచారం. మహేష్‌ పర్సనల్‌ వ్యవహారాలను, ఫ్యామిలీని, పిల్లలు ఇలా అన్నీ తనే లీడ్‌ చేస్తోంది.

పెళ్లికి ముందు మహేష్ షరతు

మహేష్‌ స్టార్‌ హీరో కావడంతో ఆయనకు ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రెజర్‌ లేకుండా నమ్రతనే మ్యానేజ్‌ చేస్తుందని టాక్‌. ఇవే కాదు బిజినెస్‌లను కూడా  టేక్‌ కేర్‌ చేస్తున్నారని  తెలుస్తోంది.

ఇదిలా ఉంటే 1993లో ఫెమినా మిస్‌ ఇండియా విజేత అయిన నమ్రత.. ఆ తర్వాత సినిమా రంగంలోకి వచ్చింది. బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అక్కడ చాలా సినిమాలు చేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి `వంశీ` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ తర్వాత చిరంజీవితో `అంజి` లో నటించింది నమ్రత. అయితే మహేష్‌ ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన నమ్రతకి ఒక కండీషన్‌ పెట్టాడట.

నమ్రత కెరీర్ త్యాగం

పెళ్లికి ముందు స్పష్టంగా ఓ విషయాన్ని చెప్పాడట సూపర్‌స్టార్‌. తనకు వర్కింగ్‌ ఉమెన్‌ భార్యగా వద్దు అని అన్నారట. అంటే నమ్రత నటించడం మహేష్‌ కి ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఇద్దరూ ముందే చర్చించుకున్నారట. అందుకే నమ్రత సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక సినిమాలు చేయకూడదని డిసైడ్‌ అయ్యింది. అప్పటి వరకు కమిట్‌ అయిన మూవీస్‌ కంప్లీట్‌ చేస్తూ, ఆ తర్వాత నుంచి  నటనకు గుడ్‌ బై చెప్పేసింది.

ఆ మధ్య జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ విషయాన్ని స్పష్టం చేసింది నమ్రత. తాను మళ్లీ నటించే అవకాశం లేదని చెప్పింది. అదే సమయంలోనే మహేష్‌ పెట్టిన కండీషన్‌ గురించి వెల్లడించింది. మహేష్‌ పనిచేయని భార్య కావాలనుకున్నారు, అందుకే సినిమాలు మానేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ తర్వాత చాలా సినిమా ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసినట్టు తెలిపింది నమ్రత.

మొత్తంగా మహేష్‌ కోసం, ఫ్యామిలీ, పిల్లల కోసం ఆమె తన కెరీర్‌ని త్యాగం చేసిందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు పరోక్షంగా నమ్రత వ్యాపారవేత్తగా రాణిస్తుండటం విశేషం. ఇక వీరికి కొడుకు గౌతమ్‌ ఘట్టమనేని, కూతురు సితార ఉన్నారు. మహేష్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఎస్‌ఎస్‌ఎంబీ 29` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మహేష్ బాబు కోసం తన సినిమా కెరీర్‌ను త్యాగం చేసిన నమ్రత, ఇప్పుడు కుటుంబం, పిల్లలతో సంతోషంగా ఉంటోంది. ఆమె నిర్ణయం నిజంగానే సంచలనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.