|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేష్ బాబు సినిమా డిజాస్టర్‌కు అసలు కారణం ఇదే! నిర్మాత సంచలన నిజం బయటపెట్టారు..!

Published: 06-01-2026, 5:30 AM
మహేష్ బాబు సినిమా డిజాస్టర్‌కు అసలు కారణం ఇదే! నిర్మాత సంచలన నిజం బయటపెట్టారు..!
  • నిర్మాత అనిల్ సుంకర ‘1 నేనొక్కడినే’ సినిమా డిజాస్టర్‌కు గల కారణాలను వెల్లడించారు.
  • సినిమా ట్రైలర్ రిలీజ్ సమయంలో ఒక ఫోన్ కాల్ రావడంతో ప్రదర్శన ఆగిపోయింది.
  • అభిమానులు నిరాశ చెందారు, సరైన ట్రైలర్ లేకపోవడం సినిమాకు నష్టం చేకూర్చింది.
  • నిర్మాత ప్రకారం, తాము అనుకున్న ట్రైలర్ విడుదల చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమా డిజాస్టర్‌కు కారణంపై నిర్మాత అనిల్ సుంకర షాకింగ్ నిజాలు బయటపెట్టారు. ట్రైలర్ రిలీజ్ సమయంలో జరిగిన అనూహ్య ఘటనలు, ఒక ఫోన్ కాల్ సినిమాపై ఎలా ప్రభావం చూపాయో ఆయన వివరించారు. ఈ సంచలన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

‘1 నేనొక్కడినే’ ట్రైలర్ రిలీజ్ వెనుక రహస్యం

Mahesh Babu Disaster Movie: ఇటీవల మహేష్ బాబు హీరోగా చేసిన నేనొక్కడినే సినిమా..నిర్మాత అనిల్ సుంకర ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరస్తోంది. ప్రస్తుతం ఆయన నారీ నారీ నడుమ మురారి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా గతంలో 1 నేనొక్కడినే సినిమా ప్రమోషన్స్ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.

అప్పుడు ఈ సినిమా సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతుండగా.. ట్రైలర్ రిలీజ్‌ను చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశారట సినిమా యూనిట్. సాధారణంగా జరిగే పెద్ద స్టేజ్ ఈవెంట్ కాకుండా..తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లలో అభిమానులకు టికెట్లు ఇచ్చి..అక్కడే లైవ్‌గా ట్రైలర్ చూపించాలనే ఆలోచన చేశారంట. అంతేకాదు..హీరో మహేష్ బాబు కూడా లైవ్ లింక్ ద్వారా అభిమానులతో మాట్లాడేలా ప్లాన్ చేశారంట.

అన్నీ సిద్ధమయ్యాక.. స్టేజ్ మీదకు వెళ్లే క్షణాల్లోనే ఒక ఫోన్ కాల్ వచ్చిందట. “ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తే సినిమాకు నష్టం జరుగుతుంది” అని ఆ కాల్‌లో ఒకతను..హెచ్చరించారట. ఆ మాటలు విని టీమ్ మొత్తం ఒక్కసారిగా షాక్‌కు గురైందని అనిల్ సుంకర చెప్పారు. వెంటనే ట్రైలర్ రిలీజ్‌ను ఆపేసి.. తర్వాత ఒక యాక్షన్ కట్ మాత్రమే విడుదల చేశారని తెలియజేశారు.

ఒక ఫోన్ కాల్ తో ఆగిన ట్రైలర్ ప్రదర్శన

అయితే థియేటర్లకు వచ్చిన అభిమానులు మాత్రం తీవ్రంగా నిరాశ చెందారంట. ముందుగా ట్రైలర్ లో ఏమీ లేదని ఆ తర్వాత సినిమా చూసినప్పుడు ట్రైలర్ కి సినిమాకి సంబంధం లేదని.. అంతేకాకుండా సినిమా ఏదో ఉంటుందని తమను ముందే ప్రిపేర్ చేయలేదు అని అసనం వ్యక్తం చేశారంట. దీంతో నిర్మాత అతని మాటల వినకుండా తమ అనుకున్న ట్రైలర్ విడుదల చేసి ఉంటే బాగుందేమో అని చెప్పుకొచ్చారు..

బాక్సాఫీస్ పరంగా చూస్తే.. 1 నేనొక్కడినే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ కాలక్రమేణా ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కథ, స్క్రీన్‌ప్లే, మేకింగ్ పరంగా ఇది టాలీవుడ్‌లో ఒక ధైర్యమైన ప్రయోగంగా ఇప్పటికీ అభిమానులు మెచ్చుకుంటూ ఉంటారు.

అభిమానుల నిరాశ: బాక్సాఫీస్ పై ప్రభావం

ఇక అనిల్ సుంకర ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతికి ఎన్నో సినిమాల మధ్య విడుదల అవుతుంది. మరి ఆ సినిమాలో పోటీ తట్టుకొని ఈ సినిమా నిలబడుతుందో లేదో చూడాలి.

మొత్తానికి, ‘1 నేనొక్కడినే’ ట్రైలర్ వివాదం, అభిమానుల నిరాశ సినిమా బాక్సాఫీస్ ప్రదర్శనపై ప్రభావం చూపాయి. అనిల్ సుంకర వెల్లడించిన విషయాలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇది సినీ రంగంలో చిన్న సంఘటనలు కూడా ఎంత కీలకం అవుతాయో చూపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.