|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉదిత్ నారాయణ్ షాకింగ్ సీక్రెట్: నా గర్భాశయం తీసేశారు! మొదటి భార్య సంచలన ఆరోపణలు!

Published: 12-02-2026, 3:05 AM
ఉదిత్ నారాయణ్ షాకింగ్ సీక్రెట్: నా గర్భాశయం తీసేశారు! మొదటి భార్య సంచలన ఆరోపణలు!
  • ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణపై ఆయన మొదటి భార్య రంజనా ఝా సంచలన ఆరోపణలు చేశారు.
  • 1996లో తన గర్భాశయాన్ని బలవంతంగా తొలగించారని రంజనా ఆరోపించారు.
  • ఈ కుట్రలో ఉదిత్ నారాయణ, ఆయన సోదరులు, రెండో భార్య కూడా ఉన్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
  • గతంలో భరణం ఇస్తానని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని రంజనా ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ చిక్కుల్లో పడ్డారు. ఆయన మొదటి భార్య రంజనా ఝా ఆయనపై బీహార్‌లో కేసు వేయడం సంచలనంగా మారింది. 1996లో తన గర్భాశయాన్ని బలవంతంగా తొలగించారని ఆమె ఆరోపిస్తున్నారు.

ఉదిత్ నారాయణపై మొదటి భార్య సంచలన ఆరోపణలు

Udit Narayan: తెలుగులో ‘మీసాల పిల్లా’ అంటూ.. ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఉదిత్ నారాయణ చిక్కుల్లో పడ్డారు. ఆయన మొదటి భార్య రంజనా ఝా, ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై బీహార్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇంటకు ముందే ఆమె ఉదిత్ పై కేసు వేశారు. తాజాగా మరో సారో వివాదం తెరపైకి తీసుకొచ్చారు. ఈ సారి రంజనా చేసిన అత్యంత షాకింగ్ ఆరోపణ చేశారు. అది ఏమిటంటే, 1996లో అనారోగ్యం నెపంతో తనను ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి, తన అంగీకారం లేకుండానే గర్భాశయాన్ని తొలగించారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇటీవల మరో సమస్య కోసం డాక్టర్‌ను సంప్రదించినప్పుడు మాత్రమే ఈ విషయం తనకు తెలిసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మరోసారి ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణపై ఆమె కేసు పెట్టారు.

Read also- Hey Bhagawan Trailer: సస్పెన్స్ హిలేరియస్ గా హే భగవాన్ ట్రైలర్.. ఎలా ఉందంటే?

1996లో గర్భాశయం తొలగింపు.. రంజనా ఫిర్యాదు

ఈ కుట్రలో ఉదిత్ నారాయణ్‌తో పాటు ఆయన సోదరులు సంజయ్ కుమార్ ఝా, లలిత్ నారాయణ్, ఆయన రెండో భార్య దీపా నారాయణ్ కూడా ఉన్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు 1984లో ఉదిత్ నారాయణ్‌తో పెళ్లయిందని, ఆ తర్వాత ఆయన ముంబై వెళ్లి అక్కడ దీపా నారాయణ్‌ను రెండో వివాహం చేసుకున్నారని ఆమె తెలిపారు. బీహార్‌లోని సుపాల్‌ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆమె ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలు జరిగి చాలా కాలం (దాదాపు 30 ఏళ్లు) గడిచిపోయినందున, ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. గతంలో ఉదిత్ నారాయణ్ తనకు భరణం ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ ప్రస్తుతం తనను పట్టించుకోవడం లేదని, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నానని రంజనా పేర్కొన్నారు.

Read also- Peddi: పెద్దికి ఆ సెంటిమెంట్ కలిసొచ్చేనా.. ఆ డేట్ ఫిక్స్ అయితే హిస్టరీ రిపీట్!

కుట్రలో ఉదిత్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారన్న రంజనా

గతంలో (2006లో) కూడా రంజనా ఝా ఉదిత్ నారాయణ్ భార్యగా హక్కుల కోసం పోరాడారు. అప్పట్లో కొంతకాలం వివాదం నడిచిన తర్వాత, ఉదిత్ నారాయణ్ ఆమెను తన మొదటి భార్యగా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ గర్భాశయం తొలగింపు వంటి తీవ్రమైన ఆరోపణలతో ఆమె ముందుకు రావడం చర్చనీయాంశమైంది. దీనిపై ఉదిత్ నారాయణ్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. తాజాగా దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మొత్తానికి ఉదిత్ నారాయణపై ఆయన మొదటి భార్య చేసిన ఈ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనిపై ఉదిత్ నారాయణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.