|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలుగు తెరకు మనస్విని బాల బొమ్మల పరిచయం! ‘కొక్కొరొకో’తో సంచలనం సృష్టించనున్నారా?

Published: 17-01-2026, 11:00 AM
తెలుగు తెరకు మనస్విని బాల బొమ్మల పరిచయం! 'కొక్కొరొకో'తో సంచలనం సృష్టించనున్నారా?
  • మనస్విని బాల బొమ్మల ‘కొక్కొరొకో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు.
  • సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.
  • దర్శకుడు రమేష్ వర్మ ఆర్వీ ఫిల్మ్ హౌస్ ద్వారా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
  • శ్రీనివాస్ వసంతల దర్శకత్వంలో 2026లో ఈ చిత్రం విడుదల కానుంది.

ప్రముఖ రంగస్థల నటి మనస్విని బాల బొమ్మల ‘కొక్కొరొకో’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా ద్వారా ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

‘కొక్కొరొకో’తో మనస్విని బాల బొమ్మల సినీ రంగ ప్రవేశం

Manaswini Balabommala: సినిమా ఇండస్ట్రీలోకి నిరంతరం ఎంతోమంది కొత్తవారు అడుగుపెడుతూ వారి టాలెంట్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే థియేటర్ రంగంలో మంచి అనుభవం కలిగిన Little Women నాటకంలో జోగా, Much Ado About Nothing లో బియాట్రిస్‌గా ప్రధాన పాత్రలు పోషించిన మనస్విని బాల బొమ్మల వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈమె ‘ కొక్కొరొకో’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన తెలియజేయడమే కాకుండా పస్టు లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

ఇలా పోస్టర్ విడుదల చేస్తూ.. “మా బంగార్రాజు ఫ్యామిలీ నుంచి మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ సంక్రాంతి ‘కొక్కోరోకో’ త్వరలో థియేటర్లలో” అంటూ పోస్టర్ విడుదల చేశారు ఈ పోస్టర్లో మనస్వినితో పాటు సీనియర్ నటుడు సముద్రఖని సహా ఇతర నటులతో కలిసి కనిపించారు. ఈ సినిమా మనస్వినికి మొదటి తెలుగు సినిమా కావటం విశేషం.యువతరంలో మంచి గుర్తింపు సాధించే ప్రతిభావంతురాలైన మనస్విని బాలబొమ్మల తెలుగులో “కొక్కోరోకో” చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆమె సినిమా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.

ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి తన కొత్త బ్యానర్ ఆర్వీ ఫిల్మ్ హౌస్ ద్వారా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాకు శ్రీనివాస్ వసంతల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కొక్కోరోకో అనే టైటిల్ పెట్టడంతో కచ్చితంగా ఈ సినిమా కోడిపందాల నేపద్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టం అవుతుంది. 2026వ సంవత్సరంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇలా థియేటర్ రంగంలో ఎంతో అనుభవం కలిగిన మనశ్విని వెండితెర పైకి ఓ అద్భుతమైన సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని స్పష్టమవుతుంది.

ఈమె నటనలో మాత్రమే కాదు శాస్త్రీయ సంగీత నేపథ్యంలో కూడా ఎంతో మంచి పట్టు ఉంది. ఈమెకు పెరిని పని నాట్యం శాస్త్రీయ నృత్యంలో, కర్ణాటక సంగీతంలోనూ మంచి శిక్షణ, ప్రావీణ్యం కలిగి ఉన్నారు. పలు వేదికలపై భక్తి గీతాలను ప్రదర్శించడమే కాకుండా గ్లెండెల్ అకాడమీలో యాంకర్ గా కూడా కొనసాగారు. నటన, నాటక రంగంలో మంచి అనుభవం కలిగిన మనస్విని వెండి తెరపైకు రాబోతుండటం విశేషం. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు వెండితెరపై కూడా మంచి సక్సెస్ అందుకోవాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు.

2026లో విడుదల కానున్న చిత్రం

మొత్తానికి, థియేటర్ రంగంలో మంచి అనుభవం ఉన్న మనస్విని బాల బొమ్మల ‘కొక్కొరొకో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కావడం ఆమె సినీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు కానుంది. ఈ చిత్రం విజయం సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.