|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంచలనం సృష్టిస్తున్న ‘జన నాయగన్’: విడుదల ముందే విజయ్ సరికొత్త రికార్డు!

Published: 30-12-2025, 6:09 AM
సంచలనం సృష్టిస్తున్న 'జన నాయగన్': విడుదల ముందే విజయ్ సరికొత్త రికార్డు!
  • ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ మలేషియాలో డిసెంబర్ 27న ఘనంగా జరిగింది.
  • ఈ వేడుకకు 85,000 మందికి పైగా అభిమానులు హాజరై సరికొత్త రికార్డు సృష్టించారు.
  • సినిమా వేడుక ‘మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకుంది.
  • ‘జన నాయగన్’ విజయ్ కెరీర్‌లో చివరి సినిమాగా నిలవనుంది, ఆపై రాజకీయాల్లోకి.

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల ముందే సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కావడంతో, ఇది ‘మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం దక్కించుకుంది. ఈ సినిమా విజయ్ కెరీర్‌లో చివరిది కావడం విశేషం.

‘జన నాయగన్’ ఆడియో లాంచ్ సంచలనం!

Jana Nayagan Record: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు విజయ్ దళపతి(Vijay Thalapathy) ఒకరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్ త్వరలోనే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జననాయగన్(Jana Nayagan) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9వ తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల మలేషియాలో ఆడియో లాంచ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది.

డిసెంబర్ 27వ తేదీ మలేషియాలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ వేడుకలలో భాగంగా సుమారు 85000 మందికి పైగా అభిమానులు పాల్గొని ఈ వేడుకను ఎంతో విజయవంతం చేశారు.ఇలా విదేశాలలో ఒక సౌత్ ఇండియన్ హీరో సినిమా వేడుక జరుగుతుంటే ఈ స్థాయిలో అభిమానులు రావడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలోనే జననాయగన్ సినిమా మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ (Malaysia Book of Records)లో స్థానం సంపాదించుకుంది. ఇలా జననాయగన్ సినిమా వేడుక రికార్డులను సృష్టించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు!

హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ఈ సినిమా విజయ్ కెరియర్ లోనే ఆఖరి సినిమాగా నిలవనుంది. ఈ సినిమా అనంతరం విజయ్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండబోతున్నారని ఇటీవల అధికారకంగా వెల్లడించారు. ఇలా వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయలేక పోయినప్పటికీ ప్రజలలో ఒక్కడిగా ప్రజాసేవకే అంకితం అవుతానని తెలియజేశారు. ఇక ఈయన పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించిన నేపథ్యంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసారు.

ఇలా తమ అభిమాన హీరో ఇక తెరపై కనిపించరని తెలిసిన అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేసినప్పటికీ రాజకీయాల పరంగా ఈయన మంచి సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. విజయ్ గత కొద్ది నెలల క్రితం టివికే పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఈ పార్టీ విషయంలో ఈయన బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త సినిమాలకు కమిట్ అవ్వకుండా, ఉన్న సినిమాలన్నింటిని పూర్తి చేసి పూర్తిస్థాయిలో రాజకీయాలలో బిజీ కానున్నారు. మరి విజయ్ ఆఖరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జననాయగన్ సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.

విజయ్ చివరి సినిమా.. రాజకీయ అరంగేట్రం!

‘జన నాయగన్’ సినిమా ద్వారా విజయ్ నటుడిగా రికార్డులు సృష్టిస్తూనే, రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నారు. అభిమానులు ఆయన భవిష్యత్తు ప్రయాణానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వెండితెరకు వీడ్కోలు పలికినప్పటికీ, ప్రజాసేవలో ఆయన సక్సెస్ కావాలని ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.