|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: మోహన్ బాబుపై బాంబు దాడి వెనుక అసలు నిజం చెప్పిన మంచు లక్ష్మి!

Published: 07-04-2026, 4:05 AM
షాకింగ్: మోహన్ బాబుపై బాంబు దాడి వెనుక అసలు నిజం చెప్పిన మంచు లక్ష్మి!
  • శ్రీరాములయ్య సినిమా ప్రారంభోత్సవంలో మోహన్ బాబుపై జరిగిన బాంబు దాడి గురించి మంచు లక్ష్మి సంచలన విషయాలు వెల్లడించారు.
  • బాంబు దాడిలో తన తండ్రి బ్రతకడం వెనుక దేవుడి కవచంలాంటి రక్షణ ఉందని మంచు లక్ష్మి భావోద్వేగంగా చెప్పారు.
  • ఆ సమయంలో ముందు, వెనుక కార్లలోని వారంతా చనిపోయారని, మోహన్ బాబు మాత్రం క్షేమంగా బయటపడ్డారని ఆమె గుర్తు చేసుకున్నారు.
  • మంచు లక్ష్మి రాజా రవీంద్రతో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నారు, దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.

మంచు లక్ష్మి తన తండ్రి మోహన్ బాబుపై జరిగిన బాంబు దాడి గురించి సంచలన విషయాలు వెల్లడించారు. శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్ సమయంలో జరిగిన ఈ ఘటన గురించి ఆమె రాజా రవీంద్రతో మాట్లాడుతూ ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నారు.

మోహన్ బాబుపై బాంబు దాడి – మంచు లక్ష్మి వెల్లడి

Manchu Lakshmi: చిత్ర సీమలో సెలబ్రిటీ కిడ్ గా తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకోవడమే కాకుండా తన గొప్ప మనసుతో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు పాటుపడుతూ.. విద్యాదానం చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న మంచు లక్ష్మీ (Manchu Lakshmi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సినిమాలతో బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడు పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. సందడి చేసే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ప్రముఖ సినీ నటుడు రాజా రవీంద్ర స్టార్ట్ చేసిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకుంది. అందులో భాగంగానే “శ్రీరాములయ్య” సినిమా ఓపెనింగ్ సమయంలో తన తండ్రి మోహన్ బాబు పై జరిగిన బాంబు బ్లాస్ట్ గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టింది. ముఖ్యంగా తన తండ్రి ఎందుకు బ్రతికున్నారు? అనే ప్రశ్న తనలో మొదలైంది అనే ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టింది మంచు లక్ష్మీ.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఈ నేపథ్యంలోనే తన తండ్రిపై జరిగిన బాంబు బ్లాస్ట్ గురించి మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. ” ఆ సమయంలో నాకు ఫోన్ వచ్చింది ..ఎక్కడ ఉన్నావ్ లక్ష్మి.. డాడీకి బాంబ్ బ్లాస్ట్ అయింది. ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ విషయం అన్నపూర్ణ స్టూడియో వరకు వినిపించిందని అన్నారు. అప్పుడు నాకేం అర్థం కాలేదు. మా నాన్న ఎందుకు బ్రతికారు? వీళ్ళు ఎందుకు చనిపోయారు ? మా నాన్న బ్రతుకుతారా? లేదా? ఆయన ముందున్న కారులో అందరూ చనిపోయారు. అలాగే వెనుకున్న కారులో కూడా అందరూ చనిపోయారు.. ఆయన ఉన్న కారులో వెనకాల బాడీగార్డ్స్ కూడా చనిపోయారు.. దేవుడు వచ్చి ఒక కవచం వేసినట్టే జరిగింది” అంటూ ఎమోషనల్ అయ్యింది మంచు లక్ష్మీ. ఏది ఏమైన మంచు లక్ష్మీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే క్యూరియాసిటీని కూడా పెంచేస్తోంది. మంచు లక్ష్మీ ఇంకా ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఏమేం చెబుతుందో చూడాలి.

దేవుడి దయతో బ్రతికి బయటపడ్డ మోహన్ బాబు

మోహన్ బాబు 1997లో శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్ నుంచీ వస్తుండగా బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ సినిమాని అప్పటి రాజకీయ నాయకులు పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా రూపొందించారు.. శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓపెనింగ్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. దీనికి గెస్ట్ గా పరిటాల రవి కూడా హాజరయ్యారు . ఓపెనింగ్ జరిగాక పరిటాల రవి , మోహన్ బాబు ఒకే కారులో బయలుదేరారు. ముందు , వెనుక కార్లలో వారి మనుషులు , సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే రామానాయుడు గేటు దాటగానే బాంబు ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది . ముందు కారులో ఉన్న వారంతా చనిపోయారు . వెనుకల కారులో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. మిడిల్ కారులో పరిటాల రవి, మోహన్ బాబు మాత్రమే ఉన్నారు. అయితే వీరితో పాటు కారులో ఉన్న గన్ మెన్స్ అందరూ చనిపోయారు. కానీ పరిటాల రవి , మోహన్ బాబు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

వైరల్ అవుతున్న మంచు లక్ష్మి కామెంట్స్

మోహన్ బాబు విషయానికి వస్తే.. చిత్ర పరిశ్రమలో అంచలంచెలు ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అయితే ఈ స్టేజికి రావడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో.. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే . మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా సెటిల్ అయ్యారు. మళ్లీ విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా ఎదిగారు. అలా విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న ఈయన కలెక్షన్ కింగ్ గా టాలీవుడ్లో ఎదురులేని హీరోగా పేరు దక్కించుకున్నారు.. సుమారుగా 500కి పైగా చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన ఈయన ఇప్పుడు మళ్లీ విలన్ గా సినిమాలు చేస్తున్నారు.. అందులో భాగంగానే నాని హీరోగా నటిస్తున్న “ది ప్యారడైజ్” చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు మోహన్ బాబు.

మొత్తానికి మంచు లక్ష్మి తన తండ్రి గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన గురించి ఆమె ఇంకా ఏ విషయాలు వెల్లడిస్తారో చూడాలి. ఈ ఇంటర్వ్యూ ప్రోమో మాత్రం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.