|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

100 కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న మంచు విష్ణు.. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌కు ముందడుగు

Published: 21-08-2025, 9:15 PM
100 కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న మంచు విష్ణు.. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌కు ముందడుగు

‘కన్నప్ప’ సినిమా తర్వాత మంచు విష్ణు తన కొత్త ప్రాజెక్టు గురించి ప్రకటించారు. రూ.100 కోట్లతో మైక్రో డ్రామాలను నిర్మించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను సృష్టించే అవకాశం ఉంది.

Key Points

1

మంచు విష్ణు 100 కోట్లతో మైక్రో డ్రామాలు నిర్మించనున్నారు.

2

మూడు నుంచి ఏడు నిమిషాల వ్యవధితో సాగే ఎపిసోడ్స్‌తో కూడిన ఈ మైక్రో డ్రామాలు.

4

భారతీయ వినోద రంగంలో కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతున్న ఈ ప్రయత్నం.

మంచు విష్ణు కొత్త ప్రాజెక్ట్

డివైన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కన్నప్ప’ తరువాత మంచు విష్ణు చేయబోయే ప్రాజెక్టులు, సినిమాలపై అందరి దృష్టి పడింది. ‘ కన్నప్ప ’ సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చిన విష్ణు మంచు మీద ఆడియెన్స్ ఎంతలా ప్రశంసలు కురిపించారో అందరికీ తెలిసిందే.

ఇక మంచు విష్ణు ఇప్పుడు మైక్రో డ్రామాలపై రూ. వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసేందుకు విష్ణు మంచు ముందడుగు వేయబోతోన్నారు. మైక్రోడ్రామాలతో విష్ణు మిరాకిల్స్ చేయబోతోన్నారు.

మూడు నుంచి ఏడు నిమిషాల వ్యవధితో సాగే ఎపిసోడ్స్‌ని మైక్రో డ్రామాలు అని చెప్పుకోవచ్చు. మొబైల్‌లో యూజర్స్‌కి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా వాటిని రూపొందించాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారు. సాధారణ రీల్స్ మాదిరిగా కాకుండా, పూర్తి స్థాయి నిర్మాణం, ప్రొఫెషనల్ దర్శకత్వం, ఎఫెక్టివ్ స్టోరీ, నెరేషన్‌తో ఈ మైక్రో డ్రామాల్ని రూపొందించనున్నారట.

100 కోట్ల పెట్టుబడి

ఈ కొత్త వెంచర్ భారతీయ వినోదంలో గేమ్-ఛేంజింగ్‌గా మారుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ పరిణామం గురించి తెలిసిన పరిశ్రమ వర్గాలు.. ‘ఈ ఏడాది ‘కన్నప్ప’తో అత్యంత చర్చనీయాంశంగా విష్ణు నిలిచారు.

తరువాతి తరం కథలను ఎలా చెబుతారు? అసలు ఎలాంటి కథలు తెరపైకి వస్తాయి? అని చర్చించుకునే స్థాయికి చేరుకున్నారు. యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా విష్ణు అందరిని మెస్మరైజ్ చేశారు. ఇక ఈ మైక్రో డ్రామాలతో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారు’ అని అనుకుంటున్నాయి.

ఇవే కాకుండా మరి కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్ని కూడా విష్ణు పట్టాలెక్కిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, కన్నప్ప సినిమా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిసిందే. జూన్ 27న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలైన కన్నప్ప సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

మైక్రో డ్రామాల ప్రత్యేకత

బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప మూవీలో కీలక పాత్ర పోషించిన మోహన్ బాబు ఆ చిత్రాన్ని నిర్మించారు. అలాగే, కన్నప్ప సినిమాలో మంచు విష్ణుకు జోడీగా తమిళ బ్యూటి ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా చేసింది.

మంచు విష్ణు, ప్రీతి ముకుందన్, మోహన్ బాబుతోపాటు మలయాళ స్టార్ మోహన్ లాల్ , బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ , శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ , మధుబాల, బ్రహ్మానందం తదితర స్టార్స్ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే.

మంచు విష్ణు యొక్క ఈ కొత్త ప్రయత్నం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది. భారీ బడ్జెట్‌తో రూపొందించబడే ఈ మైక్రో డ్రామాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.