|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మార్కాపురం విషాదం: బస్సులో అగ్నికీలలు, 10 మంది దుర్మరణం! దిగ్భ్రాంతిలో ప్రజలు!

Published: 25-03-2026, 10:35 PM
మార్కాపురం విషాదం: బస్సులో అగ్నికీలలు, 10 మంది దుర్మరణం! దిగ్భ్రాంతిలో ప్రజలు!
  • మార్కాపురం జిల్లాలో రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
  • ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో బస్సులో మంటలు.
  • ప్రమాదంలో 10 మంది సజీవదహనం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం.
  • హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుండగా ప్రమాదం, క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స.

మార్కాపురం జిల్లాలో రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు దగ్ధం కావడంతో 10 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

రాయవరంలో ఘోర రోడ్డు ప్రమాదం

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 10 మంది సజీవదహనమైనట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ఈ బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే ప్రమాదం జరిగిన క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో బస్సులోని పలువురు ప్రయాణికులు మంటల్లో చిక్కిపోగా… 10 మంది చనిపోయినట్లు ప్రాథమికంగా తెలిసింది.

బస్సు దగ్ధం, 10 మంది సజీవదహనం

ప్రాథమిక సమచాారం మేరకు… ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో జరిగింది. పలకల క్వారీల బస్సు మలుపు తిరుగుతుండగా టిప్పర్‌ ఢీకొట్టినట్లు తెలిసింది. బస్సు వెనుక భాగంలో ఉన్నవారే ఎక్కువగా చనిపోయారు. ముందు భాగంలో ఉన్న సుమారు 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

సమచాారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

ఈ దుర్ఘటన మార్కాపురం ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.