
📌 Key Points
- మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఎల్ అండ్ టీ సైట్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.
- నిర్మాణానికి సంబంధించిన కీలక డిజైన్లు, వ్యయ ప్రణాళికల ఫైళ్లు దగ్ధం.
- బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన.
- ప్రమాద కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ దర్యాప్తు ప్రారంభం.
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఎల్ అండ్ టీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లు కాలి బూడిదయ్యాయి. ఇప్పటికే పిల్లర్ల కుంగుబాటుపై విచారణ జరుగుతున్న తరుణంలో ఈ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మేడిగడ్డ అగ్నిప్రమాదం: అసలేం జరిగింది?
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ వద్ద ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టిన ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (L&T) కి చెందిన సైట్ కార్యాలయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆఫీసు క్యాబిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కార్యాలయం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే…. అప్పటికే మంటలు తీవ్రరూపం దాల్చడంతో కార్యాలయం లోపల ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లతో పాటు కీలక సామాగ్రి అంతా కాలిపోయింది.
దగ్ధమైన కీలక డాక్యుమెంట్లు: ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రభావం
ఈ అగ్నిప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి, దానికి సంబంధించిన డిజైన్లు, నిర్వహణ, వ్యయ ప్రణాళికలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు పూర్తిగా కాలి బూడిదైనట్లు విశ్వసనీయ సమాచారం. గత కొంతకాలంగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మరియు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీలు దర్యాప్తు జరుపుతున్న తరుణంలో.. ఈ అగ్నిప్రమాదం జరగడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
విచారణల నడుమ అగ్నిప్రమాదం: అనుమానాలు రేకెత్తుతున్నాయా?
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
మేడిగడ్డ అగ్నిప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిజానిజాలు వెలికితీయాల్సిన అవసరం ఉంది. కీలక డాక్యుమెంట్లు దగ్ధం కావడం ప్రాజెక్టు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది.


