|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఇకపై ఆ పాత్రల్లో కనిపించను.. సంచలన నిర్ణయం తీసుకున్న మీనాక్షి చౌదరి!

Published: 13-01-2026, 11:00 PM
షాకింగ్: ఇకపై ఆ పాత్రల్లో కనిపించను.. సంచలన నిర్ణయం తీసుకున్న మీనాక్షి చౌదరి!
  • దుల్కర్ సల్మాన్‌తో మీనాక్షి చౌదరి ‘లక్కీ భాస్కర్’ మూవీలో భార్య పాత్ర!
  • తల్లి పాత్రలు వద్దంటున్న మీనాక్షి.. కారణం ఇదే!
  • కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్రలా? స్నేహితుల సలహా!
  • నవీన్ పొలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’ మూవీలో మీనాక్షి చౌదరి!

టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి సంచలన ప్రకటనతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ‘లక్కీ భాస్కర్’ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ, ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్దాం!

లక్కీ భాస్కర్‌తో మీనాక్షికి బ్రేక్!

స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదర గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ప్రజెంట్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒకరాజు’ మూవీలో యాక్ట్ చేస్తుంది. మారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్నది. అలాగే శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌ కో ప్రొడ్యూస్ చేస్తుంది.

తల్లి పాత్రలపై మీనాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు

మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. అయితే మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ క్రమంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది మాట్లాడుతూ.. ‘లక్కీ భాస్కర్ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు భార్యగా నటించినందుకు నాకు ప్రశంసలు లభించాయి.

ఫ్రెండ్స్ చెప్పిన మాటలకు మీనాక్షి రియాక్షన్!

కానీ కొందరు స్నేహితులు నన్ను భయపెట్టారు. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇలా భార్యగా, బిడ్డకు తల్లిగా నటించకపోవడం చాలా మంచిదని చెప్పారు. ఎందుకంటే నువ్వు ఇలాంటి పాత్రలు చేయడం స్టార్ట్ చేస్తే నిన్ను అమ్మ, అక్క పాత్రలకే పరిమితం చేస్తారని అన్నారు. అయితే లక్కీ భాస్కర్ సినిమా కథ నచ్చి తల్లి క్యారెక్టర్ చేశాను. ఇక అటువంటి పాత్రలు వస్తే చేయలేనని చెప్తాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

మీనాక్షి చౌదరి తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.