|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ప్రభాస్ కాదు, మీనాక్షి చౌదరి ఫస్ట్ క్రష్ అతనేనా? కోరికలు వింటే మైండ్ బ్లాక్!

Published: 18-01-2026, 7:00 AM
షాకింగ్: ప్రభాస్ కాదు, మీనాక్షి చౌదరి ఫస్ట్ క్రష్ అతనేనా? కోరికలు వింటే మైండ్ బ్లాక్!
  • మీనాక్షి చౌదరి: తొమ్మిదో తరగతిలో టీచర్ పైనే ఫస్ట్ క్రష్ అట, స్కూల్ డేస్ మెమొరీస్ గుర్తు చేసుకున్న హీరోయిన్!
  • ప్రభాస్ లాంటి భర్త కావాలన్న మీనాక్షి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రమోషన్స్‌లో మనసులోని మాట బయటపెట్టిన బ్యూటీ!
  • వంద ఎకరాల వ్యవసాయం, మూడు బ్రేకప్స్ ఓకే కానీ.. ఇంట్లో పనిచేసే మొగుడు కావాలంటున్న మీనాక్షి చౌదరి!
  • `అనగనగా ఒక రాజు` మూవీతో మీనాక్షి సక్సెస్, సంక్రాంతి క్వీన్ అంటూ ఫ్యాన్స్ హంగామా!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఆమె ఫస్ట్ క్రష్ గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

టీచర్‌పై క్రష్: మీనాక్షి చౌదరి షాకింగ్ సీక్రెట్!

మీనాక్షి చౌదరీ గతేడాది సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో హిట్‌ అందుకుంది. అప్పుడు వెంకటేష్‌ సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు `అనగనగా ఒక రాజు` మూవీతో విజయాన్ని అందుకుంది. నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఇప్పుడు విజయవంతంగా రన్‌ అవుతుంది. భారీ వసూళ్లని రాబడుతోంది. దీంతో సంక్రాంతి క్వీన్‌గా మారుతుంది మీనాక్షి.

ఇటీవల మీనాక్షి చౌదరీ మ్యారేజ్‌ విషయం ఇటీవల చర్చనీయాంశం అయ్యింది. ఆమె హీరోతో లవ్‌ లో ఉందని, పెళ్లి చేసుకోబోతుందనే వార్తలొచ్చాయి. హీరో సుశాంత్‌, మీనాక్షి చౌదరీ డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్ వచ్చిన నేపథ్యంలో ఇటీవలే దీనిపై ఆమె స్పందించింది. అలాంటిదేమీ లేదని, అవి కేవలం రూమర్స్ మాత్రమే అని చెప్పింది. సుశాంత్‌ మంచి ఫ్రెండ్‌ అని చెప్పింది. ప్రస్తుతం తాను సింగిల్‌ అని వెల్లడించింది.

ప్రభాస్ భర్తగా రావాలన్న మీనాక్షి.. యూటర్న్!

ఈ క్రమంలో మీనాక్షి చౌదరీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమె తన ఫస్ట్ క్రష్‌ని వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందే తనకు క్రష్‌ ఉన్నట్టు చెప్పింది. స్కూల్‌ టైమ్‌ లో తనకు క్రష్‌ ఏర్పడిందని చెప్పింది. తాను 9వ తరగతి చదువుకునే సమయంలో స్కూల్‌ టీచర్‌పై క్రష్‌ స్టార్ట్ అయ్యిందట. అయితే ఆ విషయం తన తోటి ఫ్రెండ్స్ కి కూడా తెలియడంతో వారంతా తనని ఆటపట్టించేవారట. అది తనకు బెస్ట్‌ మెమొరీ అని చెప్పింది.

ఇక సినిమాల్లోకి వచ్చాక తన క్రష్‌ని వెల్లడించింది మీనాక్షి. డార్లింగ్‌ ప్రభాస్‌పై తన ఇష్టాన్ని పంచుకుంది. గతేడాది `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె తనకు ఎలాంటి భర్త కావాలో చెప్పింది. ప్రభాస్‌లాగా మంచి హైట్‌ ఉండాలని, అంతే మంచి మనసు ఉండాలని చెప్పింది. ఇంటలిజెంట్‌గా ఉండాలని చెప్పింది. ప్రభాస్‌ లో ఇలాంటి క్వాలిటీస్‌ ఉంటాయి, కాబట్టి ప్రభాస్‌ లాంటి వ్యక్తి భర్తగా రావాలని చెప్పి షాకిచ్చింది మీనాక్షి. మొత్తంగా ప్రభాస్‌ అయితే బెటర్‌ అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది.

వంద ఎకరాల ఆస్తితో పని చేసే మొగుడు కావాలి!

అయితే ఇటీవల మాట మార్చింది మీనాక్షి. `అనగనగా ఒక రాజు` మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆమె తనకు కాబోయే భర్తకి ఉండాల్సిన లక్షణాలు చెబుతూ, వంద ఎకరాల వ్యవసాయం ల్యాండ్‌ ఉండాలట. మూడు బ్రేకప్స్ అయినా ఫర్వాలేదని, ఇంట్లో పని చేయాలి, బట్టలు ఉతకాలి అని, వంట కూడా చేయాలని చెప్పింది. రాజ్మా తన ఫేవరేట్‌ డిష్‌ అని, అది బాగా చేయాలని చెప్పింది. బట్టలు ఉతకడమే కాదు, ఐరన్‌ కూడా చేయాలని చెప్పింది. జాయింట్‌ ఫ్యామిలీ అంటే ఇష్టమని, అలాంటి ఫ్యామిలీలోని అబ్బాయి అయితే బాగుంటుందని, అదే సమయంలో రోజుకి మూడు గిఫ్ట్స్ ఇచ్చేవాడు కావాలి అని తెలిపింది. ఫైనల్‌గా సినిమాల్లోని వ్యక్తిని, మోడలింగ్‌ చేసే వ్యక్తిని పెళ్లి చేసుకోనని వెల్లడించింది మీనాక్షి. ఇలా తన కోరికల చిట్టా బయటపెట్టి అందరిని షాక్‌కి గురి చేసింది. ఇలా అయితే ఏఐలోనే అబ్బాయిని క్రియేట్‌ చేయాలని నవీన్‌ పొలిశెట్టి పంచ్‌ వేయడం విశేషం.

మీనాక్షి చౌదరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.