
📌 Key Points
- చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో ‘మెగా 158’ చిత్రం ప్రారంభం కానుంది.
- ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 14న ప్రారంభం కానుంది.
- ‘వాల్తేరు వీరయ్య’ కంటే మాస్ ఎలిమెంట్స్‌తో బాబీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
- జనవరి 12, 2027న ‘మెగా 158’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ‘మెగా 158’ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుండగా, షూటింగ్ ప్రారంభం ఆలస్యం కానుంది.
‘మెగా 158’ ప్రారంభం ఎప్పుడు?
Mega 158: టాలీవుడ్‌లో ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా ప్రారంభం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా షూటింగ్ షెడ్యూల్ విడుదల తేదీకి సంబంధించిన కీలక వార్తలు బయటకు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ విషయంలో చిన్న మార్పు జరిగినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రారంభోత్సవం కాస్త ఆలస్యమై.. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన లేదా మార్చి నెలాఖరులో జరగనుంది. కొత్త ఏడాదిలో మెగాస్టార్ కొత్త సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Read also- Yami Gautam: కృతి సనన్‌ను అవమానించడంపై యామీ గౌతమ్ వివరణ.. ఏం జరిగిందంటే?
చిరంజీవి లుక్ ఎలా ఉండబోతోంది?
సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలోనే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారు. ఏప్రిల్ 14న షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవిని వింటేజ్ లుక్‌లో చూపించిన బాబీ, ఈసారి అంతకు మించిన మాస్ ఎలిమెంట్స్‌తో ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి సీజన్ ఎప్పుడూ కలిసొచ్చే అంశమే. అందుకే ఈ సినిమా విడుదలను కూడా పక్కాగా ప్లాన్ చేశారు. జనవరి 12, 2027న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువల తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే సంక్రాంతికి విచ్చిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మెగాస్టార్ మరోసారి సంక్రాంతికి రావడానికి రెడీ అవుతున్నారు. మరి రాబోయే సంక్రాంతి కలిసి వస్తుందో లేదో చూడాలి మరి.
సంక్రాంతి బరిలో మెగాస్టార్!
Read also- Psychological horror thriller OTT: పెళ్ళి కాకుండానే ప్రెగ్నెన్సీ… నరకం చూపించే సైతాన్… ఏం సినిమా సామి
చిరంజీవికి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చే అంశం. మరి ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి సంక్రాంతి బరిలో విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి.


