|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అర్ధరాత్రి అడవిలోని బంగ్లా.. గర్ల్ ఫ్రెండ్ మర్డర్.. ఓటీటీలోకి తమిళ సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్

Published: 06-08-2025, 9:11 PM
అర్ధరాత్రి అడవిలోని బంగ్లా.. గర్ల్ ఫ్రెండ్ మర్డర్.. ఓటీటీలోకి తమిళ సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్

అర్ధరాత్రి అడవిలోని ఒక బంగ్లాలో గర్ల్‌ఫ్రెండ్ హత్యతో ప్రారంభమయ్యే ‘యాదుమ్ అరియాన్’ అనే తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ ఆహా తమిళ్ లో ఆగస్టు 8న విడుదల కానుంది. ఈ సినిమాలో ఊహించని ట్విస్ట్‌లు కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి.

Key Points

1

అర్ధరాత్రి అడవిలోని బంగ్లాలో గర్ల్‌ఫ్రెండ్ హత్య!

2

స్నేహితుల మధ్య జరిగిన ఈ ఘటనతో ట్విస్ట్స్ పుష్కలం!

4

థ్రిల్లింగ్ కథానకంతో మైండ్ బ్లాక్ అయ్యే సస్పెన్స్!

అడవిలోని బంగ్లాలో హత్య రహస్యం

డిఫరెంట్ స్టోరీ లైన్ తో, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లతో తెరకెక్కిన తమిళ థ్రిల్లర్ చిత్రం ‘యాదుమ్ అరియాన్’ (Yaadhum ariyaan) ఓటీటీలోకి వచ్చేస్తోంది. మర్దర్ చూట్టూ సాగే గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఇది. ఆడియన్స్ కు కచ్చితంగా థ్రిల్ పంచే సినిమా ఇది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందో చూద్దాం.

తమిళ థ్రిల్లర్ సినిమా ‘యాదుమ్ అరియాన్’ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఈ మూవీ ఆహా తమిళ్ లోకి రాబోతోంది. ఆగస్టు 8 న ఓటీటీ లోకి అడుగుపెడుతుంది. అంటే రేపటి (శుక్రవారం) నుంచి ఓటీటీ లవర్స్ కు థ్రిల్ పంచేందుకు రెడీ అయింది. ప్రస్తుతానికి ఈ మూవీ తమిళంలోనే అందుబాటులోకి రానుంది.

‘యాదుమ్ అరియాన్’ ఓటీటీ విడుదల తేదీ

జులై 18న థియేటర్లలో రిలీజైంది యాదుమ్ అరియాన్. ఈ థ్రిల్లర్ మూవీ పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతంమాత్రంగానే దక్కాయి. 96 నిమిషాల రన్ టైమ్ మాత్రమే ఉన్న ఈ సినిమాకు ఎం.గోపీ డైరెక్టర్. బ్రేకింగ్ పాయింట్ పిక్చర్స్ పై గోపీనే చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ సీనియర్ నటుడు తంబి రామయ్య, అప్పు కుట్టీ, ఆనంద్ పండి, దినేష్, ప్రణా నాయకి, రాజకుమారి, శ్యామల్, ఆనంద్ రాజ్ తదితరులు నటించారు.

అంతకుముందు చిన్న చిన్న పాత్రలు పోషించిన దినేష్ ఈ మూవీతో హీరోగా మారాడు. ఈ సైకో థ్రిల్లర్ మూవీలో తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ను సీఎం అయినట్లు చూపించారు. విజయ్ కు తాను ఫ్యాన్ అని, ఆయన సినిమాలకు గుడ్ బై చెప్తుండటంతో ఇలా సీఎంగా చూపించానని గోపీ అన్నారు.

ట్విస్ట్‌లతో కూడిన కథానకం

ఇద్దరు ప్రాణ స్నేహితులుంటారు. వాళ్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ ను తీసుకుని ఫారెస్ట్ లోకి వెళ్తారు. ఒక రోజు సరదాగా గడపాలని ప్లాన్ చేసుకుంటారు. అడవిలో ఒంటరిగా ఉండే బంగ్లాలోకి వెళ్తారు. అర్ధరాత్రి వేళ ఇందులో ఒకరి గర్ల్ ఫ్రెండ్ హత్యకు గురవుతుంది. తన బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా ఉన్న టైమ్ లోనే ఆమె చనిపోతుంది. దీంతో అందరూ భయపడతారు. ఆమె ఎలా చనిపోయిందనే విషయం అర్థం కాక కంగారు పడతారు.

డెడ్ బాడీ వాళ్లతోనే ఉంటుంది. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడతారు. అప్పుడు శవాన్ని మాయం చేయాలని అనుకుంటారు. కానీ తర్వాత జరిగే పరిణామాలు మరింత భయాన్ని కలిగిస్తాయి. మరి ఈ హత్య ఎవరు చేశారు? అసలు ఆ బంగ్లాలో ఏముందనేది కథ.

యాదుమ్ అరియాన్ చిత్రం థియేటర్లలో అంతగా ఆకట్టుకోకపోయినా, ఓటీటీలో మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది. ఈ థ్రిల్లింగ్ కథ మీరు తప్పకుండా చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.