|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రెండే సినిమాలు.. రూ.500 కోట్లు.. మలయాళం మూవీ రేంజ్ ఎక్కడికో తీసుకెళ్లిన స్టార్ హీరో మోహన్‌లాల్

Published: 09-06-2025, 9:59 AM
రెండే సినిమాలు.. రూ.500 కోట్లు.. మలయాళం మూవీ రేంజ్ ఎక్కడికో తీసుకెళ్లిన స్టార్ హీరో మోహన్‌లాల్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 2024లో వరుస డిజాస్టర్ల తర్వాత 2025లో రెండు సినిమాలతో అద్భుత విజయం సాధించారు. రెండు సినిమాలతో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మలయాళ సినిమా ఇండస్ట్రీని కదిలించేశారు.

Key Points

1

రెండు సినిమాలతో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు

2

ఎల్2: ఎంపురాన్, తుడరుమ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్

4

2024లో వరుస డిజాస్టర్ల తర్వాత 2025లో అద్భుత విజయం

2024లో వరుస డిజాస్టర్లు

మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్ కు గతేడాది అస్సలు కలిసి రాలేదు. మలైకొట్టై వాలిబన్, బరోజ్ 3డీ సినిమాలు డిజాస్టర్లు కావడంతో అతని పనైపోయిందని అనుకున్నారు. కానీ ఈ ఏడాది ఎల్2: ఎంపురాన్, తుడరుమ్ సినిమాలతో బ్లాక్‌బస్టర్లు అందించడమే కాదు.. మలయాళం బాక్సాఫీస్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లాడు.

మోహన్‌లాల్ తన కెరీర్ మొదలు పెట్టి 45 ఏళ్లవుతోంది. కానీ ఇప్పటికీ అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ ఏడాది అతడు ఇచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ చూస్తే తెలుస్తుంది. ఈ ఏడాది ఒక్కడే కేవలం రెండే సినిమాలతో మాలీవుడ్ కు ఏకంగా రూ.500 కోట్ల బిజినెస్ చేసి పెట్టాడు. ఎల్2: ఎంపురాన్ తో ఈ ఏడాది తొలి మెగా బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఏకంగా రూ.265.5 కోట్లు వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా చరిత్ర సృష్టించింది.

ఇక తాజాగా తుడరుమ్ మూవీతో అదే మ్యాజిక్ మరోసారి రిపీట్ చేశాడు. ఈ థ్రిల్లర్ మూవీ అసలు ఎవరి ఊహలకు అందని విధంగా రూ.234.5 కోట్లు వసూలు చేసింది. ఎల్2: ఎంపురాన్ తో పోలిస్తే.. ఇది చాలా తక్కువ బడ్జెట్ మూవీ. అయినా ఈ స్థాయి వసూళ్లు ఆశ్చర్యకరమే. ఈ రెండూ కలిపితే మొత్తంగా రూ.500 కోట్లు కావడం విశేషం. ఈ ఏడాది సక్సెస్ కంటే ఫెయిల్యూర్సే ఎక్కువ చూసిన మాలీవుడ్ కు మోహన్‌లాల్ ఓ వెలుగు రేఖలా నిలిచాడు.

2025లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్

మోహన్‌లాల్ కు 2024లో అస్సలు కలిసి రాలేదు. అతడు తీసిన రెండు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. మలైకొట్టై వాలిబన్ రూ.29.75 కోట్లు, బరోజ్ 3డీ కేవలం రూ.15.1 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. ఓరకంగా లోబడ్జెట్ సినిమాలు తీసే మాలీవుడ్ లో ఇవి కూడా మంచి వసూళ్లే. కానీ ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో అత్యంత భారీ అంచనాల మధ్య వచ్చాయి. అంతేకాదు ఓవైపు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వరుస విజయాలతో దూసుకెళ్తుండగా.. మోహన్ లాల్ ఇలా వరుస డిజాస్టర్లు ఇవ్వడంతో అతని పనైపోయినట్లే అని చాలా మంది భావించారు.

కానీ 2025 మరోసారి మోహన్‌లాల్ రేంజ్ ఏంటో మలయాళం సినిమాకే కాదు మొత్తం ఇండియన్ సినిమాకే తెలిసేలా చేసింది. మమ్ముట్టితో పోలిస్తే మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే ఈ స్టార్ హీరో సినిమాలకు భారీ వసూళ్లు అన్నది ఎప్పటి నుంచో వస్తోంది. ఈ ఏడాది అది కాస్తా పీక్ స్టేజీకి వెళ్లింది.

మోహన్ లాల్ యొక్క అద్భుత విజయం

మోహన్‌లాల్ ఈ ఏడాది ఇంతటితో ఆగిపోవడం లేదు. తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వృషభ కూడా ఇదే ఏడాది రిలీజ్ కానుంది. ఈ మధ్యే తన బర్త్‌డే సందర్భంగా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. అక్టోబర్ 16న వృషభ రిలీజ్ కానుంది. మరో మూవీ హృదయపూర్వం అయితే ఆగస్ట్ 28నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇవే కాకుండా ఓ పేద్ద మల్టీ స్టారర్ కూడా మలయాళం సినిమాను ఊరిస్తోంది. మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇది ఇప్పటి వరకూ మాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తుందని భావిస్తున్నారు.

మోహన్ లాల్ యొక్క ఈ విజయం మలయాళ సినిమాకు మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమాకు ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటన. వృషభ సినిమాతో ఆయన విజయం కొనసాగుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.