
📌 Key Points
- చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతికి విడుదలైంది.
- సినిమాలో చిరంజీవి కొడుకుగా నటించిన విక్కీ పాత్రలో నటించింది అమ్మాయి అని చిత్ర బృందం తెలిపింది.
- విక్కీ పాత్రలో ఊహ అనే అమ్మాయి నటించిందని డైరెక్టర్ అనిల్ రావిపూడి వెల్లడించారు.
- ఊహ తన జుట్టును కూడా కత్తిరించుకొని అబ్బాయిలా నటించిందని అనిల్ రావిపూడి అన్నారు.
చిరంజీవి, నయనతార జంటగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి కొడుకుగా నటించిన విక్కీ పాత్రలో నటించింది అమ్మాయి అని చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ లో వెల్లడించింది.
చిరంజీవి సినిమాలో విక్కీ పాత్ర
MSVPG film: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi)నయన తా(Nayanthara) జంటగా నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు(MSVPG). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అన్ని ప్రాంతాలలోనూ మంచి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా కలెక్షన్లు కూడా భారీగా రాబడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం, అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు. అయితే ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక విషయాన్ని బయట పెట్టారు .ఈ సినిమాలో చిరంజీవి కొడుకులుగా ఇద్దరు చిన్నారులు సందడి చేసిన సంగతి తెలిసిందే. అందులో చిన్న కొడుకు విక్కీ పాత్ర అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ పాత్రలో నటించింది అబ్బాయి కాదని, అమ్మాయని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా విక్కీ పాత్రలో నటించిన చిన్నారి ఊహ (Ooha) హాజరయ్యారు. ఇలా ఈ చిన్నారి అబ్బాయి పాత్రలో నటించారనే విషయం తెలిసిన అభిమానులు కూడా ఆశ్చర్య వ్యక్తం చేశారు.
విక్కీగా నటించిన చిన్నారి ఊహ
ఇక ఊహ గురించి డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. అబ్బాయి పాత్రలో ఊహ అద్భుతంగా నటించింది .సాధారణంగా అమ్మాయిలకు జుట్టు అంటే చాలా ఇష్టం. కానీ ఊహ ఈ పాత్ర కోసం తన జుట్టును కూడా కత్తిరించుకొని ఈ సినిమాలో నటించింది అంటూ అనిల్ రావిపూడి చెప్పడంతో ఒక్క సారిగా ఊహ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏది ఏమైనా అబ్బాయి పాత్రలో అమ్మాయి నటించారనే విషయం తెలిసి అందరూ షాక్ లో ఉండిపోయారు.
సంతోషంలో మెగా అభిమానులు..
అనిల్ రావిపూడి మాటల్లో ఊహ గురించి
ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఇందులో చిరంజీవి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు ఇక చిరంజీవి నాయన తార జంటగా నటించగా, ఈ సినిమాలో వెంకటేష్ వెంకి గౌడ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. ఏది ఏమైనా సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది.
చిరంజీవి సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. సినిమాలో చిన్నారి నటి ఊహ అబ్బాయి పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయం మెగా అభిమానులకు సంతోషాన్ని కలిగించింది.


