|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

MSVPG: మెగా విక్టరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్! తేదీ, వేదిక వివరాలు ఇవే!

Published: 05-01-2026, 9:30 AM
MSVPG: మెగా విక్టరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్! తేదీ, వేదిక వివరాలు ఇవే!
  • MSVPG సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
  • ప్రీ రిలీజ్ వేడుక జనవరి 7న హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా జరగనుంది.
  • ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.
  • సినిమాలో వెంకటేష్ సుమారు 25 నిమిషాల పాటు కనిపించనున్నారని సమాచారం.

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSVPG) సినిమా ప్రీ రిలీజ్ వేడుక జనవరి 7న హైదరాబాద్‌లో జరగనుంది. చిరంజీవి, వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్న ఈ ఈవెంట్ వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

MSVPG ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక

MSVPG Pre Release: సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల నుంచి మొదలుకొని చిన్న హీరోల సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇక 2026 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రభాస్ ,చిరంజీవి వంటి హీరోల సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు (MSVPG)సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదలకు కేవలం 7 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా, ట్రైలర్ కు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ వేడుక గురించి చిత్ర బృందం బిగ్ అప్డేట్ తెలియజేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జనవరి ఏడో తేదీ ఉండవచ్చు అంటూ గత కొద్దికొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే జనవరి ఏడో తేదీ హైదరాబాదులో ఈ వేడుక ఎంతో ఘనంగా జరగబోతుందని చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. “మెగా విక్టరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అదిరిపోద్ది సంక్రాంతి అంటూ చిరంజీవి, వెంకటేష్ ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు.

జనవరి 7వ తేదీ హైదరాబాదులో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుందని వెల్లడించినప్పటికీ వేదిక ఇంకా ఫిక్స్ కాలేదని తెలుస్తోంది . ఈ ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి, వెంకటేష్ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. మొదటిసారి వెంకటేష్ చిరంజీవి కలిసిన నటించిన సినిమా కావడంతో ఈ సినిమా కోసం వెంకీ అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో వెంకటేశ్ సుమారు 25 నిమిషాల పాటు తెరపై సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.

మెగాస్టార్, విక్టరీ వెంకటేష్ సందడి

It’s time for the BIGGEST CELEBRATION of #ManaShankaraVaraPrasadGaru 😀❤️‍🔥 #MSG MEGA VICTORY PRE-RELEASE EVENT ON 7th January in Hyderabad 💥

— https://t.co/MrHIIt5eIR

GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY 2026. #MSGonJan12th pic.twitter.com/iQFq6tYwKK

సినిమాలోని కీలక అంశాలు

— Shine Screens (@Shine_Screens) January 5, 2026

ఈ సినిమాలో వెంకటేష్ చిరంజీవి ఇద్దరు మంచి స్నేహితులుగా కనిపించబోతున్నారు. నయనతారను పెళ్లి చేసుకోవడానికి వచ్చే అబ్బాయి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అరగంట పాటు వీరిద్దరి నటనతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి తెలియజేశారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించగా, మరొక హీరోయిన్ కేథరిన్ కూడా సందడి చేయబోతున్నారు.చిరంజీవి ఈ సినిమాలో ఎన్ఐఎ అధికారిగా కనిపించగా, తన వద్ద అసిస్టెంట్ పాత్రలో కేథరిన్ కనిపించబోతున్నారని తెలుస్తోంది.. మొత్తానికి ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా మన శంకర్ వరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ వేడుకతో ఈ అంచనాలు మరింత పెరిగి, సినిమా విజయానికి దోహదపడతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.