|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

MSVPG: ‘వెంకీ గౌడ’ గా వెంకటేష్! స్టోరీ లీక్‌పై అనిల్ రావిపూడి సంచలన నిజాలు!

Published: 07-01-2026, 12:35 PM
MSVPG: 'వెంకీ గౌడ' గా వెంకటేష్! స్టోరీ లీక్‌పై అనిల్ రావిపూడి సంచలన నిజాలు!
  • MSVPG ప్రీ రిలీజ్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా రహస్యాలను బయటపెట్టారు.
  • వెంకటేష్ ‘వెంకీ గౌడ’ పాత్రలో నటించారు; ఈ పాత్రకు చిరంజీవి సలహా కారణం.
  • నయనతార సమ్మె సమయంలోనూ హైదరాబాద్‌లోనే ఉండి సినిమా కోసం అంకితభావంతో పనిచేశారు.
  • MSVPG కేవలం కామెడీ మాత్రమే కాదు, బలమైన ఎమోషన్ కూడా ఉంటుందని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.

MSVPG ప్రీ రిలీజ్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి కీలక విషయాలు వెల్లడించారు. వెంకటేష్ ‘వెంకీ గౌడ’ పాత్రలో నటించారని, చిరంజీవి సలహా మేరకు ఈ పాత్ర చేర్చారని తెలిపారు. నయనతార కృషిని ప్రశంసిస్తూ, సినిమా కేవలం కామెడీనే కాదు బలమైన ఎమోషన్ కూడా ఉందని వివరించారు.

అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు

MSVPG Pre Release: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) వెంకటేష్ (Venkatesh)నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు(MSVPG). సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బంధం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఇక చిరంజీవి సినిమాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను బయటపెట్టారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ..

ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ గురించి మాట్లాడుతూ అందరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ సినిమా కోసం మెయిన్ పిల్లర్ గా ఉన్నటువంటి నయనతార, వెంకటేష్, చిరంజీవి గురించి కూడా మాట్లాడారు. నయనతార గారు స్ట్రైక్ సమయంలో తన పిల్లలతో కలిసి హైదరాబాద్లోనే ఉండి ఈ సినిమా కోసం పని చేశారని అందుకు ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అని తెలియచేశారు. నిజానికి నయనతార ఈ వేడుకకు హాజరు కావాల్సి ఉండగా ప్రస్తుతం ఆమె విదేశాలలో ఉన్న నేపథ్యంలో రాలేకపోయారని తెలిపారు.

వెంకీ గౌడగా వెంకటేష్: చిరంజీవి సలహా!

ఇక వెంకటేష్ గురించి మాట్లాడుతూ వెంకీ గారితో నాకు ఇది టెక్నికల్ గా ఐదో సినిమా అని తెలిపారు. వెంకటేష్ గారితో తనకు ఒక ఫ్రెండ్, గైడెన్స్, ఒక ఫ్యామిలీ మెంబర్ అనే రిలేషన్ ఉందని ఈ సినిమాలో వెంకటేష్ గారు నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక వెంకటేష్ గారు ఈ సినిమాలో నటించడానికి ప్రధాన కారణం చిరంజీవి అని తెలియజేశారు. సినిమా కథ చెప్పగానే ఇలా ఇంకొక క్యారెక్టర్ పెడితే బాగుంటుంది అంటూ చిరంజీవి గారి ఇచ్చిన సలహా మేరకు వెంకటేష్ పాత్రను ఇందులో పెట్టామని ఈ సినిమాలో వెంకటేష్ వెంకీ గౌడ(Venkey Gowda) పాత్రలో కనిపించబోతున్నారని తెలిపారు.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ గారు చిరంజీవి గారి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా ఉంటాయని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని అనిల్ రావిపూడి తెలియజేశారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ అందరూ ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ అని అనుకుంటున్నారు కాకపోతే ఈ సినిమాలో చాలా ఎమోషన్ కూడా ఉందని, కచ్చితంగా ప్రేక్షకులు అందరూ ఎమోషన్ కు కనెక్ట్ అవుతారు అంటూ అనిల్ రావిపూడి ఈ సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారి గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక వెంకటేష్ సుమారు 25 నిమిషాల పాటు ఈ సినిమాలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక 11వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి.

నయనతార కృషి, సినిమాలోని ఎమోషన్

MSVPG ప్రీ రిలీజ్ వేడుక సినిమాపై భారీ అంచనాలను పెంచింది. వెంకటేష్ ‘వెంకీ గౌడ’ పాత్ర, చిరంజీవి సలహా, బలమైన ఎమోషన్ వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అనిల్ రావిపూడి నొక్కి చెప్పారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.